మంత్రి కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. "హ్యాట్రిక్ లోడింగ్ 3.o.. గెట్ రెడీ సెలబ్రేటీ గాయ్స్" అని ట్వీట్ చేశారు. దీంతో బీఆర్ఎస్ గెలుపుపై మరింత విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. ఈ ఉదయం కూడా ఒక ట్వీట్ చేశారు.
ఆసియా క్రీడల్లో భారత్ ప్రచారం ముగిసింది. ఆసియా క్రీడల్లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన చేసింది. 2023 ఆసియా క్రీడల్లో భారత ఆటగాళ్లు 107 పతకాలు సాధించారు. ఆసియా క్రీడల చరిత్రలో తొలిసారిగా భారత్ 100 పతకాల మార్కును దాటింది. అందులో 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్య పతకాలు ఉన్నాయి.
ఆసియా క్రీడలు 2023లో పాకిస్థాన్‌తో జరిగిన పూల్-ఎ మ్యాచ్‌లో భారత హాకీ జట్టు చారిత్రాత్మక ప్రదర్శన కనబరిచింది. ఈ మ్యాచ్‌లో భారత్ 10-2 తేడాతో విజయం సాధించింది.
భారత్ మొదటి టీ20లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మ్యాచ్ ఆరంభంలోనే కెప్టెన్ జస్ప్రిత్ బుమ్రా తన ప్రతాపాన్ని చూపించాడు. రీ ఎంట్రీ తర్వాత అద్భుతమైన ఓపెనింగ్ ఇచ్చాడు. తన మొదటి ఓవర్లలోనే ఐర్లాండ్ రెండు వికెట్లను పడగొట్టాడు.
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తారని అన్నారు.
ఉత్తరప్రదేశ్ లో బీజేపీ భవిష్యత్ విజయాలపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలతో పాటు 2027, 2032లో జరిగే యూపీ ఎన్నికల్లోనూ తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
నాలుగు నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మళ్లీ మైదానంలోకి దిగిన భారత మహిళా క్రికెట్ జట్టు అనుకున్నట్టుగానే విజయాన్ని నమోదు చేసింది. మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో టీమిండియా మహిళల జట్టు విజయం సాధించింది. బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టి20లో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
త్వరలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తుందని బీజేపీ ఓడిపోవడం ఖాయమని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. గడిచిన ఐదేళ్ళలో మా ప్రభుత్వం అనుసరించిన విధానాలు, మేము చేసిన అభివృద్ధిని మాత్రమే ప్రజలు తీసుకుంటారు.