ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరికాసేపట్లో తీహార్ జైలు నుంచి విడుదలకానున్నారు. శుక్రవారం దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన పత్రాలు జైలు అధికారులకు అందాయి.
తీహార్ జైలు నుంచి విడుదలైన ఆప్ నేత, ఎంపీ సంజయ్ సింగ్ నేరుగా కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నారు. వచ్చి రాగానే సునీతా కేజ్రీవాల్‌కు నమస్కరించారు. అనంతరం ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌పై కేజ్రీవాల్ సతీమణి సునీతా తీవ్ర ఆరోపణలు చేశారు. కస్టడీలో ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను వేధిస్తున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు. తీవ్రంగా వేధిస్తున్నారంటూ మీడియాకు తెలియజేశారు.