Europe : ప్రజల పాలిట శాపంగా నాలుగు పరిశ్రమలు.. ప్రతిరోజూ 7000 మంది మృతి
- చెడు ఆహారపు అలవాట్లతో ఐరోపాలో 27లక్షలమంది మృతి
- ఈ మరణాలకు మద్యం పొగాకు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ శిలాజ ఇంధనం కంపెనీలే కారణం
- కఠినమైన చట్టాలను అమలు చేయాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Europe : ఐరోపా ప్రజలలో ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. ఇలాంటి ఆహారపు అలవాట్ల వల్ల కలిగే హాని గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తన నివేదికను షేర్ చేసింది. నాలుగు రకాల పరిశ్రమల గురించి నివేదికలో చాలా ముఖ్యమైన విషయాలను వెల్లడించింది. మద్యం, పొగాకు, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, శిలాజ ఇంధనం ఈ నాలుగు పరిశ్రమలు ఐరోపాలో 27 లక్షల మరణాలకు కారణమయ్యాయని ఈ నివేదికలో పేర్కొంది.
‘ప్రపంచ ఆరోగ్య సంస్థ యూరోప్ ప్రాంతంలో నాన్-కమ్యూనికేబుల్ డిసీజెస్ కమర్షియల్ డిటర్మినెంట్స్'(‘Commercial Determinants of Non Communicable Diseases in WHO Europe Region’) అనే ఈ నివేదికలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య సంస్థలు ఈ పరిశ్రమలను ఆపడానికి కఠినమైన చట్టాలను అమలు చేయాలని పిలుపునిచ్చాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ యూరప్ రీజియన్ డైరెక్టర్ హన్స్ క్లూగే ఒక ప్రకటనలో, “ఈ నాలుగు పరిశ్రమలు ఐరోపాలోని 53 దేశాలలో ప్రతిరోజూ కనీసం 7 వేల మందిని చంపుతున్నాయి.” అని పేర్కొన్నారు.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
Read Also:TG TET 2024 Results: టీజీ టెట్ ఫలితాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
ఈ నాలుగు పరిశ్రమలు ప్రజా విధానాలను అడ్డుకుంటున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోపించింది. అంతేకాకుండా తప్పుడు ప్రకటనలు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, సైన్స్‌ను అపహాస్యం చేయడం వంటి ఆరోపణలు చేశారు. కంపెనీల ఈ విధానాల వల్ల ఆరోగ్య లక్ష్యాలను సాధించడం కష్టమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అన్ని శాఖల ప్రాధాన్యత లాభదాయకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ పరిశ్రమలు మార్కెట్‌లో పెద్ద వాటాను కలిగి ఉన్నాయి. దీని కారణంగా అవి తరచుగా రాజకీయ శక్తులను కూడా ప్రభావితం చేస్తాయి. ఐరోపాలో 60 శాతం మంది పెద్దలు, మూడింట ఒక వంతు మంది పిల్లలు ఊబకాయం (అధిక బరువు) సమస్యలతో బాధపడుతున్నారు.
2017 నుండి వచ్చిన డేటా ప్రకారం ఐరోపాలో గుండె జబ్బులు, క్యాన్సర్‌తో మరణిస్తున్న ప్రతి ఐదుగురిలో ఒకరు ఆహారపు అలవాట్ల ఫలితంగానే చనిపోతున్నారు. అనారోగ్యకరమైన ఆహార పదార్థాలను తయారు చేసే కంపెనీలపై కఠిన చట్టాలను అమలు చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ దేశాలకు పిలుపునిచ్చింది. ప్రజలు తమ ఆరోగ్యానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఈ పరిశ్రమల నెట్‌వర్క్ చాలా పెద్దదని, అవి ప్రభుత్వాల విధాన రూపకల్పనలో కూడా జోక్యం చేసుకుంటున్నాయని హన్స్ క్లూగే చెప్పారు. కంపెనీల గుత్తాధిపత్య పద్ధతులు, లాబీయింగ్ పద్ధతులను ఆపడానికి చర్యలు తీసుకోవాలని హన్స్ క్లూగే దేశాలను కోరారు.
Read Also:Balakrishna: ఇది కదా బాండింగ్ అంటే.. చెల్లెలిని ఆత్మీయంగా ముద్దాడిన బాలయ్య
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?