నేడు వ్యూహం సినిమాపై ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. వ్యూహం సినిమాపై ఏపీ హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. సోనియా, కాంగ్రెస్ పరువుకు భంగం కలిగించేలా సినిమాను చిత్రీకరించాలని పిటిషనర్ పేర్కొన్నారు. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్‌ను పునఃపరిశీలించాలని కోరారు. నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భీమవరంలో పర్యటించనున్నారు. ‘విద్యా దీవెన’కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో సీఎం పాల్గొనున్నారు. మాజీమంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డి నేడు మలివిడత సీఎం జగన్‌తో…
నేడు కృష్ణా జిల్లాలో బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి పర్యటించనున్నారు. పామర్రు బెల్ పరిశ్రమ పరిశీలన, జిల్లా కార్యవర్గ సమావేశంలో పురంధరేశ్వరి పాల్గొననున్నారు. నేడు అనకాపల్లి మండలం కూండ్రం గ్రామంలో వంగవీటి రంగా విగ్రహాంను విశాఖ ఉత్తర ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆవిష్కరించనున్నారు. అనంతరం గ్రామంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి మాట్లాడనున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత పర్యటించనున్నారు. ఉదయం 11:00 గంటలకు కొవ్వూరు టౌన్లో…