What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* కాకినాడలో మూడో రోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన.. నేడు కాకినాడ రూరల్, అర్బన్ ముఖ్య నేతలతో పవన్ సమావేశం.. పలువురు ప్రజా సంఘాలు మేధావులతో మాట్లాడనున్న పవన్.. ఉమ్మడి జిల్లాకి చెందిన 19 నియోజకవర్గాల అసెంబ్లీ కోఆర్డినేటర్లతో నేడు మరోసారి రివ్యూ
* హైదరాబాద్: నేడు ఆర్టీసీకి సంబంధించిన 80 కొత్త బస్సులను ప్రారంభించనున్న రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. నేడు అందుబాటులోకి రానున్న 80 కొత్త బస్సులు.. ఎన్టీఆర్ మార్గ్‌లోని అంబేడ్కర్ విగ్రహం దగ్గర ఉదయం 10 గంటలకు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వీటిని ప్రారంభిస్తారు.
Also Read
- Ivolga high-speed train: భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..
- PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
- BRICS: మోడీ విందుకు జిన్‌పింగ్ డుమ్మా.. కారణం ఏంటంటే..?
- Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
* ఖమ్మం: నేడు మణుగూరులో భద్రాద్రి పవర్ ప్లాంట్ ను పరిశీలించి అధికారులతో రివ్యూ చేయనున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. అనంతం మధిర నియోజకవర్గం జమలాపురంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్న మంత్రి.. ఆ తర్వాత మిషన్ భగీరథ పై సమీక్ష నిర్వహించనున్న భట్టి
* ఆదిలాబాద్: ఉమ్మడి జిల్లాలో పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు.. చలికి గజ గజ వణికిపోతున్న ఏజెన్సీ. కొమరంభీం జిల్లా సిర్పూర్ లో 10.5డిగ్రీలుగా నమోదు. అదిలాబాద్ జిల్లా సొనాలలో 10.8గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు.. నిర్మల్ జిల్లా జామ్ లో 12.6 డిగ్రీలుగా కనిష్ట ఉష్ణోగ్రతలు. మంచిర్యాల జిల్లా నెన్నెల లో 13.5గా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు.
* ఏపీలో 19వ రోజు కొనసాగనున్న అంగన్వాడీ కార్యకర్తల నిరసన కార్యక్రమాలు..
* ఏపీలో మున్సిపల్ కార్యాలయాల వద్ద 5వ రోజు కొనసాగనున్న కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళనలు…
* ప్రకాశం : ఒంగోలు మండలం కొప్పోలు వద్ద టిడ్కో ఇళ్ల వద్ద టీడీపీ నిరసన కార్యక్రమం..
* తిరుమల: ఎనిమిదోవ రోజుకు చేరుకున్న వైకుంఠ ద్వార దర్శనం.. ఎల్లుండి అర్ధరాత్రితో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనం.. ఎల్లుండి వరకు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేసిన టీటీడీ.. ఎల్లుండి వరకు సిఫార్సు లేఖల పై విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఆకాం గోవర్ధన్ రెడ్డి తోటపల్లి గూడూరులో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* నెల్లూరు నగరంలోని కప్పాడిపాలెం ప్రాంతంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్
* నెల్లూరు రూరల్ పరిధిలోని కొత్త వెల్లంటి గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి
* అనకాపలి జిల్లా: నేడు నర్సీపట్నంలో సామాజిక సాధికార బస్సుయాత్ర.. భీమబోయినపాలెంలో మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులు పరిశీలన..
* గుంటూరు: చంద్రమౌళి నగర్ లో వార్డు, బూత్, కన్వీనర్లు వైసీపీ ముఖ్య నాయకులతో సమావేశం కానున్న మంత్రి విడదల రజిని
* గుంటూరు: నేడు మెడికల్ కాలేజ్ జింఖానా ఆడిటోరియంలో ఏపీ బార్ కౌన్సిల్, గుంటూరు బార్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సెమినార్.. హాజరుకానున్న పలువురు హైకోర్టు న్యాయమూర్తులు.
* గుంటూరు: నేడు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో కాపు రాజకీయ భవిష్యత్ కార్యాచరణ చైతన్య సదస్సు.. హాజరుకానున్న పలువురు కాపు సంఘాల నేతలు, రాజకీయ నాయకులు.
* గుంటూరు: నేడు తాడికొండలో సామాజిక సాధికార బస్సు యాత్ర, హాజరుకానున్న పలువురు మంత్రులు.
* బాపట్ల: నేడు చెరుకుపల్లి మండలం గుల్లపల్లి జడ్పీ పాఠశాలలో ఉద్యోగ మేళా.
* విజయనగరం జిల్లా: భోగాపురం మండలం చాకివలస గ్రామంలో నేడు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న నెల్లిమర్ల శాసనసభ్యులు బడ్డుకొండ అప్పలనాయుడు
* విజయనగరం జిల్లా: మెరకముడిదం మండలం శాతం వలసలో సచివాలయం రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
* విశాఖ మీదుగా అమృత్ భారత్ రైలు పరుగులు. మాల్డా-బెంగుళూరు రైలును రేపు ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ.. జనవరి 7 నుంచి రెగ్యులర్ ట్రైన్ గా అమృత్ భారత్
* పార్వతీపురం మన్యం జిల్లా, ముక్కువ మండలం డి. శిర్లం పంచాయతీలో గడపగడప కార్యక్రమంలో డిప్యూటీ సీఎం రాజన్న దొర
* విజయనగరం జిల్లా: గజపతినగరం లో నేడు రైతు భరోసా కేంద్రం భవనం మరియు గ్రామ సచివాలయం భవనం, వెల్ నెస్ సెంటర్ భవనల ప్రారంభోత్సవం చేయునున్న గజపతినగరం శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య.
* విజయనగరం: బొబ్బిలిలో పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొననున్న మంత్రి బొత్స సత్యనారాయణ..
* పశ్చిమ గోదావరి జిల్లా: తణుకు, పాలకొల్లులో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు..
* పశ్చిమగోదావరి జిల్లా: తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉండనున్న మంత్రి కొట్టు సత్యనారాయణ. .
* చిత్తూరు: మూడోరోజు కుప్పంలో చంద్రబాబు పర్యటన.. నేడు కుప్పం బస్టాండ్ లో బహిరంగ సభ.. మధ్యాహ్నం కార్యకర్తలు, నేతలతో సమావేశం
* శ్రీ సత్యసాయి: హిందూపురంలో నేడు మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం
* తిరుమల: నిన్న శ్రీవారిని దర్శించుకున్న 56,200 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 16904 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ. 3.89 కోట్లు
* కాకినాడ: నేడు అన్నవరం దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం.. చైర్మన్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సమావేశం.. దేవస్థానం అభివృద్ధికి సంబంధించి చర్చించనున్న పాలకమండలి
* తూర్పుగోదావరి జిల్లా: నేడు హోంమంత్రి తానేటి వనిత పర్యటన.. ఉదయం 10 గంటలకు కొవ్వూరులోని హోం మంత్రి అనిత ఆధ్వర్యంలో గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు, అనంతరం హోంమంత్రి తండ్రి జోన్నకూటి బాబాజీ రావు పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొంటారు .
* శ్రీకాకుళం: ఆమదాలవలసలో స్పీకర్ తమ్మినేని సీతారాం పర్యటన.. ఉదయం 8 గంటలకు బూర్జ మండలం ఉప్పిని వలస పంచాయతీ పరిధిలోని జంగాల పేట మరియు ఏబీసీ పేట గ్రామలలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారు
* మన్యం జిల్లా: మంచు దుప్పటిలో కురుపాం, గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీ ప్రాంతం.. రోడ్డు కనిపించక వాహనదారులకు తీవ్ర అంతరాయం.. చలి తగ్గుముఖం పట్టినా తగ్గని పొగమంచు తీవ్రత.
* నంద్యాల: పాణ్యం (మం) కొత్తూరు శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం లో నేడు నాగ దోష పూజలు, స్వామివారికి ప్రత్యేక అలంకరణలు
* నంద్యాల: బేతంచెర్ల మద్దిలేటి నరసింహస్వామి దేవాలయంలో నేడు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు..
* ఎన్టీఆర్ జిల్లా: నందిగామలో నేడు దళిత గళం కార్యక్రమం.. దళితులపై జరుగుతున్న దాడులపై చర్చ.. హాజరు అవుతున్న టీడీపీ నేతలు నక్క ఆనంద బాబు, వర్ల రామయ్య, వంగల పూడి అనిత, తంగిరాల సౌమ్య
* నేడు కల్లూరులో సామాజిక సాధికార బస్సు యాత్ర విజవంతం చేయాలని సన్నాహక సమావేశం
* విజయవాడ: నేడు నగరానికి మాజీ CJI TS ఠాకూర్ రాక.. విశాఖ నుంచి రాత్రి 8 గంటలకు గన్నవరం చేరుకుని ఏపీ సీజే నివాసానికి వెళ్లనున్న TS ఠాకూర్
* నేడు సంగారెడ్డి జిల్లాలో మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటన.. పటాన్‌చెరు నియోజకవర్గంలో ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి దామోదర
తాజావార్తలు
-
Varanasi Set Leak: ‘వారణాసి’కి లీక్‌ల కలకలం.. ఆలయం ముందు ఆ వింత జీవి ఏంటి జక్కన్న?
-
Ivolga high-speed train: భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..
-
Mega Mass Moment: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్, రవితేజ.. ‘ఇరుముడి’ టీమ్‌కు మెగా సర్‌ప్రైజ్ .. పిక్స్ వైరల్!
-
PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
-
Harmanpreet Kaur: ఆమె డేంజరస్ ప్లేయర్.. త్వరగా ఔట్ చేయకుంటే ఓటమి ఖాయం.. హర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!