* అమరావతి: నేడు ఆర్ధిక శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష.. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం
* ఢిల్లీ అధిష్టానంతో ఈ రోజు ఏపీ కాంగ్రెస్ నేతల కీలక సమావేశం.. ఉదయం 11 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సమావేశం.. హాజరుకానున్న సుమారు 30 మంది ఏపీ కాంగ్రెస్ నేతలు..
* హైదరాబాద్ శివారు ప్రాంతాలలో అలుముకున్న పొగమంచు.. రహదారులను కమ్మేసిన దట్టమైన పొగమంచు.. వాహనదారుల తీవ్ర ఇబ్బందులు
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేడు కొత్తగూడెం మణుగూరు, ఇల్లందు, సతుపలిలలో సింగరేణి గుర్తింపు ఎన్నికలకు ఏర్పాట్లు.. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్
* బెల్లంపల్లి రీజియన్ పరిధిలో మూడు ఏరియాల్లో ని కోల్ మైన్స్ పరిధిలో ఎన్నికలు. 31 పొలింగ్ కేంద్రాలు ఏర్పాటు.
* మంచిర్యాల జిల్లా సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి
* బెల్లంపల్లి రీజియన్ లోని 3 డివిజన్ లలో శ్రీరాంపూర్ ఏరియాలో 9124 మంది కార్మికులు , మందమర్రి ఏరియాలో 4876 కార్మికులు , బెల్లంపల్లి ఏరియా లో 985 కార్మికులు , మొత్తం 14,985 మంది కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించు కోనున్నారు, శ్రీరాంపూర్ ఏరియాలో 15 , మందమర్రి ఏరియాలో 11 , బెల్లంపల్లి ఏరియాలో 5 , మొత్తం 31 పోలింగ్ కేంద్రాలు అయా ఆయా గనుల వద్ద ఏర్పాటు చేసిన ఎన్నికల అధికారులు. ఉదయం 7 నుండి సాయంత్రం 5 గంటలకు వరకు పోలింగ్… ఆ తర్వాత కౌంటింగ్.
* ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రత లు.. ఏజెన్సీ లో కమ్ము కున్న మంచు కనపడని రోడ్లు.. ఇక్కట్లు పడుతున్న వాహన దారులు.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. అదిలాబాద్ జిల్లా సొనాల లో 10.6 గా కనిష్ట ఉష్ణోగ్రత లు నమోదు. కొమరంభీం జిల్లా సిర్పూర్ లో 10.9డిగ్రీలు గా నమోదు, నిర్మల్ జిల్లా పెంబి లో 11.6డిగ్రీలు గా కనిష్ట ఉష్ణోగ్రతలు.. మంచిర్యాల జిల్లా నిల్వాయి లో 13.1గా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు..
* ప్రకాశం : ఒంగోలులో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం సమావేశం, హాజరుకానున్న రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు..
* ప్రకాశం : ఒంగోలు కలెక్టరేట్ లో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం, హాజరుకానున్న జాయింట్ కలెక్టర్ కే శ్రీనివాసులు..
* ప్రకాశం : మార్కాపురం లోని మార్కండేశ్వర స్వామి ఆలయంలో శివ ముక్కోటి సందర్భంగా భక్తులకు ఉత్తర ద్వార దర్శనం..
* ప్రకాశం : వచ్చే నెల రెండవ తేదీ వరకు జిల్లా ఎస్పీ మలిక గర్గ్ వ్యక్తిగత సెలవు, జిల్లా ఇంచార్జ్ ఎస్పీ గా నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డి..
* ప్రకాశం : ఒంగోలు కలెక్టరేట్ ఎదుట సమస్యలు పరిష్కరించాలంటూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ధర్నా..
* విశాఖ: విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా బీజేపీ ఆధ్వర్యంలో నిరసన.. ఎంవీపీ కాలనీ ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ దగ్గర ధర్నాలో పాల్గొననున్న ఎంపీ జీవీఎల్ నరసింహారావు
* విశాఖ: నేడు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ త్రిసభ్య కమిటీ పబ్లిక్ హియరింగ్.. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనితీరుపై ప్రజాభిప్రాయసేకరణకు , ఫిర్యాదులు , స్వీకరించనున్న సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ.
* విజయనగరం జిల్లా: దత్తిరాజేరు మండలం లో పలు గ్రామాల్లో గ్రామ సచివాలయం భవనం, వెల్నెస్ సెంటర్ భవనం, రైతు భరోసా కేంద్రం భవనలను నేడు ప్రారంభోత్సవం చేయునున్న గజపతినగరం శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య.
* తూర్పుగోదావరి జిల్లా: నేడు మధ్యాహ్నం జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌కు రాక.. ఎయిర్ పోర్ట్ నుండి రోడ్డు మార్గం ద్వారా కాకినాడ వెళ్లనున్న పవన్.. ఎయిర్ పోర్ట్ లో పవన్ కు ఘన స్వాగతం పలకనున్న జనసేన శ్రేణులు
* విశాఖ: నేటి నుంచి జనవరి 3వ తేదీ వరకు APPSC పరీక్షలు.. ప్రభుత్వ ఉద్యోగుల డిపార్ట్మెంట్ టెస్టులకు భారీగా హాజరుకానున్న అభ్యర్థులు.. విశాఖ కేంద్రంలో పరీక్షకు హాజరుకానున్న 4719మంది ఉద్యోగులు..
* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజమండ్రిలో వైసీపీ శ్రేణుల ఆత్మీయ కలయిక.. మాజీ శాసనసభ్యులు రౌతు సూర్య ప్రకాశరావు రుడా చైర్మన్ గా. నియమితులైన సందర్భంగా ఏర్పాటు చేసిన సభ.. రాజమండ్రి వైసీపీలో రెండు వర్గాలు ఒకే వేదికపై కలిసే అవకాశం
* అమరావతి: నేడు ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లు ముట్టడించనున్న అంగన్వాడీలు.
* అనకాపల్లి జిల్లా: మాడుగుల నియోజకవర్గంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామానాయుడు పాదయాత్ర
*నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పొదలకూరు.. మనుబోలు మండలాలలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని ఆదిత్య నగర్.. కుసుమ హరిజనవాడలలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్
* శ్రీ సత్యసాయి : మడకశిర మండలం భక్తరపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి జిల్లేడుగుంట ఆంజనేయస్వామి వార్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు జ్యోతులు,భూతప్పల ఉత్సవం .
* అనంతపురం : శెట్టూరు మండల పరిధిలోని ములకలేడు గ్రామంలో నూతనంగా నిర్మించిన 33/11 KV విద్యుత్ ఉపకేంద్రమును ప్రారంభించనున్న మంత్రి ఉషాశ్రీచరణ్.
* కాకినాడ: నేడు సాయంత్రానికి కాకినాడ చేరుకోనున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రేపటి నుంచి మూడు రోజులు పాటు పార్టీ నేతల తో సమీక్ష సమావేశాలు.. ఉమ్మడి జిల్లాలో పోటీ చేసే స్థానాలపై ఈ పర్యటన తో క్లారిటీ వచ్చే అవకాశం
* గుంటూరు: నేడు ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం..
* గుంటూరు : పొన్నూరు నియోజకవర్గం లో గ్రావెల్ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయంటూ నేడు సేకూరులో పాదయాత్ర నిర్వహించనున్న మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర..
* గుంటూరు : నేడు తాడేపల్లి సమీపంలో ఓ కళ్యాణమండపంలో టిడిపి విస్తృతస్థాయి సమావేశం.. హాజరుకానున్న నారా లోకేష్..
* గుంటూరు : తమ సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నేటి నుంచి సమ్మెకు దిగనున్న గుంటూరు పురపాలక సంఘ కార్మికులు….
* గుంటూరు: విజ్ఞాన మందిరంలో నేడు ఐదవ రోజు కొనసాగుతున్న నంది నాటకోత్సవాలు….
* పల్నాడు : మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్ర సందర్భంగా ప్రముఖ శైవక్షేత్రాలు విశేష పంచామృత అభిషేకాలు.. పంచారామాల్లో ఒకటైన అమరావతి తోపాటు, కోటప్పకొండ లో ప్రత్యేక పూజలు…
* పశ్చిమగోదావరి జిల్లా: మంత్రి కొట్టు సత్యనారాయణ పర్యటన వివరాలు.. సీఎం జగన్ తో కలిసి శ్రీశైలం దేవస్థానంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు..
* విజయవాడ: నేడు దుర్గగుడి పాలకమండలి సమావేశం
* విజయనగరం: నేటి నుంచి వాలంటీర్లు సమ్మె బాట.. సీతనగరం, బోగాపురం ఎంపీడీవోలకు నోటిసు ఇచ్చిన వాలంటీర్లు..
* అనంతపురం : గుమ్మగట్ట మండలం తాళ్లకెర గ్రామంలో వీరభద్ర స్వామి రథోత్సవం.
* విశాఖ: గవర్నర్ అబ్దుల్ నజీర్ రెండు రోజుల పర్యటన.. నగరానికి చేరుకున్న గవర్నర్.. రేపు వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో ముఖ్యఅతిథిగా గవర్నర్
* శ్రీ సత్యసాయి: జీతాలు పెంచి , ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ హిందూపురంలో నేటి నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టనున్న వార్డు వాలంటీర్లు
* విశాఖ: గ్రేటర్ విశాఖపై మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల నిరవధిక సమ్మె ఎఫెక్ట్.. నగరంలో చెత్త సేకరణకు తప్పని ఇబ్బందులు.. గ్రేటర్ విశాఖలో ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించిన జీవీఎంసీ..
* తిరుమల: శ్రీవారి ఆలయంలో కోనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనం.. నాలుగు రోజులలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న 2.7 లక్షల మంది భక్తులు.. జనవరి 1వ తేది వరకు కోనసాగునున్న వైకుంఠ ద్వార దర్శనం.. దర్శన టోకెన్లు కలిగిన భక్తులుకే వైకుంఠ ద్వార దర్శనం
* తాడేపల్లి: నేడు వైసీపీ ఎస్సీ సెల్ సమావేశం.. అంబేద్కర్ విగ్రహ పనుల పురోగతి, ప్రారంభోత్సవ ఏర్పాట్లపై కసరత్తు చేయనున్న వైసీపీ ఎస్సీ సెల్ నేతలు