హైదరాబాద్ లో వాహన రద్దీ నెలకొంది. ఏపీలో ఈనెల 13న శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు నగర వాసులు బయలు దేరారు. హైదరాబాద్‌లో నివసించే ఏపీ వాసులంతా తమ సొంత గ్రామాలకు పయణమవుతున్నారు.
సంక్రాంతి పందాల కోసం పెద్దఎత్తున కోడి పుంజులను పెంచి విక్రయిస్తున్నారు వ్యాపారులు.. కోడి పుంజుల పెంపకం ద్వారా వందలాది మందికి ఉపాధి కూడా లభిస్తుందని చెబుతన్నారు. కోడి పుంజులు అమ్మకాల రూపంలో ఏటా రూ.12 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతోంది అంటే మామూలు విషయం ఏమీ కాదు.
Sanitation Workers Strike in Guntur: ఉమ్మడి గుంటూరు జిల్లాలో చెత్త పేరుకుపోయింది. గడిచిన ఐదు రోజులుగా పారిశుధ్య కార్మికులు సార్వత్రిక సమ్మెకు దిగడంతో.. ఇళ్లల్లో చెత్త పేరుకుపోయింది. ఇండిపెండెంట్ హౌస్‌లు, అపార్ట్మెంట్స్ అన్న తేడా లేకుండా ఇళ్లలో చెత్త నిండిపోయింది. ఓ పక్క చలికాలం, మరోపక్క దోమల బెడద ఎక్కువ అవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చెత్త విపరీతంగా పేరుకుపోవడంతో దుర్గంధంతో పాటు రోగాల బారిన పడుతున్నామని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. Also Read: ISRO:…
MLC Shaik Sabjee Dead: రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందారు. ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢీకొన్న ఘటనలో సాబ్జీకి తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఏలూరు నుంచి భీమవరం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న కారు ఢీ…
ఉభయగోదావరి జిల్లాలను అనుసంధానం చేస్తూ రాజమండ్రి కొవ్వూరు మధ్య గోదావరి నదిపై నిర్మించిన రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి 50 వసంతాలను పూర్తిచేసుకుంది. నాలుగున్నర కిలోమీటర్లు పొడవైన రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జి ఆసియా ఖండంలోనే అతిపెద్ద బ్రిడ్జి. ఈ బ్రిడ్జి మనుగడలోకి వచ్చి నేటికీ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈబ్రిడ్జిని 1974 లో అప్పటి రాష్ట్రపతి ఫ్రక్రుద్దీన్ అలీ అహ్మద్ జాతికి అంకితం చేశారు
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే కామాంధుడిగా మారిపోయాడు.. 15 ఏళ్ల చిన్నారిపై కన్నేశాడు.. పాఠాలు నేర్పాల్సిన గురువు.. ప్రేమ పాఠాలు బోధించాడు.. తాను ప్రేమిస్తున్నాను అని నమ్మబలికాడు.. విద్యార్థినికి మాయమాటలు చెప్పి స్కూల్ నుంచి తీసుకెళ్లాడు.. తాళికట్టి.. ఇక, మనకు పెళ్లి అయిపోయింది.. అంటూ ఆ తర్వాత అత్యాచారానికి తెగబడ్డాడు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో దొంగ ఓట్లను పుట్టించిందే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అని ఆయన ఆరోపించారు. ఆధార్ కార్డుతో లింక్ తర్వాత దొంగ ఓట్లు బయటికి వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
Viral Video, Ox climbed on Building Due to Rain in Palakollu: భారతదేశ వ్యాప్తంగా గత 10 రోజులుగా వర్షాలు దంచికొడుతున్న విషయం తెలిసిందే. ప్రతి రోజు వానలు కురుస్తుండడంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఓ వైపు వరదలు, మరోవైపు వర్షపు చినుకులతో జనాలు అల్లాడిపోతున్నారు. కొందరు అయితే చలితో వణికిపోతున్నారు కూడా. ఇందుకు జంతువులు కూడా అతీతమేమీ కాదు. వర్షాలకు తట్టుకోలేక సరైన చోటు కోసం వెతుకుతుంటాయి. తాజాగా ఓ ఆంబోతు…