డెడ్ బాడీ హోమ్ డెలివరీ చేసిన కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పశ్చిమగోదావరి జిల్లా ఉండి పోలీసులు. దీంతో సస్పెన్స్ థ్రిల్లర్ మిస్టరీ వీడనుంది. మృతదేహాన్ని పార్సల్ చేసి పోలీసులను ముప్పు తిప్పులు పెట్టిన నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామంలో కలకలం సృష్టించిన పార్సిల్‌లో డెడ్‌బాడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. సాగి తులసి వచ్చిన పార్సిల్‌లోని మృతదేహం కాళ్ల మండలంలోని గాంధీనగరంకు చెందిన బర్రె పర్లయ్యదిగా గుర్తించారు. పని కోసం పిలిపించి పర్లయ్యను హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. సాగి తులసి చెల్లెలి భర్త సుధీర్ వర్మనే ఈ హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సుధీర్ వర్మ నాలుగు రోజులుగా పరారీలో ఉన్నాడు. ఎప్పటికప్పుడు సిమ్ కార్డ్స్,…
పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామంలో డిసెంబర్ 19న హోమ్ డెలివరీ అయిన డెడ్ బాడీ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనకు ప్రధాన సూత్రధారి శ్రీధర్ వర్మ అని పోలీసులు భావిస్తున్నారు. పార్సిల్ అందుకున్న సాగి తులసి చెల్లెలి భర్తే ఈ శ్రీధర్ వర్మ. నిందితుడు చిక్కితే కేసులో చిక్కుముడులు వీడే అవకాశాలు ఉన్నాయి. కేసులు త్వరగా చేదించేందుకు ఉండి పోలీసులు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా నిందితుడి కోసం నాలుగు ప్రత్యేక బృందాలు…
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ప్రాంతంలో ఓ దొంగ చేసే చోరీలు వింతగా ఉన్నాయి. వందల సంఖ్యలో దొంగతనాలు చేసిన ఖరీదైన వస్తువుల్ని దోచుకుపోలేదు.. ఇంతకీ ఈ వింత దొంగ చేసిన చోరీలు వింటే మీకే ఆశ్చర్యం కలగక తప్పదు.. ఎందుకంటే అతను చేసిన చోరీలు ఏమిటంటే మహిళలు ఆరవేసిన జాకెట్లు ఎత్తుకుపోవడం.. నరసాపురం మండలంలో గత ఆరు నెలల నుంచి రాత్రి సమయాల్లో మహిళల జాకెట్లు కనిపించకుండా పోతున్నాయి. బాత్‌రూమ్‌లో.. బయట ఆరేసిన జాకెట్లను ఎత్తుకెళ్లిపోతుండటంతో గ్రామస్తులు…
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పార్శిల్‌లో గుర్తుతెలియని మృతదేహం రావడంతో.. యండగండిలో కలకలం రేపింది. మృతదేహం చూసి స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పార్శిల్‌లో ఒక ఉత్తరం కూడా ఉంది. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ నయీం అస్మి ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. యండగండి గ్రామంలో నివాసం ఉంటుంన్నముదునూరి రంగరాజు (55)కు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. పెద్దమ్మాయి సాగి…
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజవర్గంలో 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిన నిర్మించాలంటూ మంత్రి నిమ్మల రామానాయుడుకి, ఎంపీ శ్రీనివాస్ వర్మకు మాజీ మంత్రి, కాపు బలిజ సంక్షేమ సేన అధ్యక్షులు హరి రామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు.
Rabi Season : గోదావరి జిల్లాలో రబీ సాగు కోసం డెల్టా కాలువలకు డిసెంబర్ 1 నుంచి ధవళేశ్వరం బ్యారేజి నుంచి నీటిని విడుదల చేయనున్నారు. కలెక్టర్ పి.ప్రశాంతి అధ్యక్షతన జరిగిన తూర్పుగోదావరి జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 2024- 25 రబీ సీజన్ లో తూర్పు, పశ్చిమ, సెంట్రల్ డెల్టాల పరిధిలో 8 లక్షల 96 వేల 507 ఎకరాల ఆయకట్టుకు సాగు, మంచినీటి అవసరాలకు నీటిని…
తూర్పు గోదావరి-పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. డిసెంబర్ 12లోగా ఎన్నిక నిర్వహణ పూర్తి చేయాలని నిర్ణయించారు.. ఈ నెల 18 వరకు నామినేషన్ పత్రాలను స్వీకరించనున్నారు.
ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో ఉపఎన్నికకు రంగం సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం మధ్యాహ్నం షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్సీగా ఉన్న షేక్ సాబ్జీ మృతితో తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది.