Kolkata Protest: కోల్‌కతా వీధుల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటర్ల జాబితాకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ర్యాలీలో పెద్ద సంఖ్యలో తృణమూల్ కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర ప్రజలు పాల్గొన్నారు. ఈ సవరణ డ్రైవ్ అనేది ఎన్నికల సంఘంతో కలిసి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్వహించే “నిశ్శబ్ద, అదృశ్య రిగ్గింగ్” అని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. READ ALSO: DMF…
Crime: బర్త్ డే పార్టీ అని పిలిచి, ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శుక్రవారం రోజు కోల్‌కతాలో ఈ సంఘటన జరిగింది. ఇద్దరు తెలిసిన వ్యక్తులు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు హరిదేశ్ పూర్‌కు చెందిన 20 ఏళ్ల మహిళ ఆరోపించింది. చందన్ మల్లిక్, ద్వీప్ బిశ్వాస్‌గా గుర్తించబడిన నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
కోల్‌కతాలోని ప్రతిష్టాత్మక లా కాలేజీలో విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటన అందరినీ కలచివేసింది. ఈ కేసులో పట్టణ పోలీసులు నిందితులు మనోజిత్ మిశ్రా (31), జైబ్ అహ్మద్ (19), ప్రమిత్ ముఖోపాధ్యాయ అలియాస్ ప్రమిత్ ముఖర్జీ (20)లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు మోనోజిత్ మిశ్రా మాజీ విద్యార్థి, టీఎంసీ స్టూడెంట్ వింగ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. వాస్తవానికి.. జూన్ 25న కళాశాల లోపల తనపై సామూహిక అత్యాచారం జరిగిందని బాధితురాలు…
బంగ్లాదేశ్ చొరబాటుదారులపై భారత్ నిరంతరం కఠినంగా వ్యవహరిస్తోంది. కానీ అక్కడక్కడా చొరబాటు దారులు భయటపడుతూనే ఉన్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో బంగ్లాదేశ్ చొరబాటుదారుడి ఆచూకీ బయటపడింది. బంగ్లాదేశ్ పౌరుడు భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తుండటం గమనార్హం. నిందితుడి వద్ద ఓటరు, పాన్, ఆధార్ కార్డులు కూడా ఉన్నాయి.
భారత సరిహద్దు భద్రతా దళానికి చెందిన జవాను పూర్ణం సాహూ ఇటీవల పొరబాటుగా సరిహద్దు దాటి పాక్ సైన్యానికి చిక్కిన సంగతి తెలిసిందే. ఆ జవానును పాక్ బంధీగా చేసుకుంది. సైనికుడు తమ భూభాగంలోకి రావడం వల్లే అదుపులోకి తీసుకున్నట్లు పాక్ ఆర్మీ వెల్లడించింది. అయితే పాకిస్థాన్ వ్యాఖ్యలను బీఎస్ఎఫ్ అధికారులు తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటన జరిగి 85 గంటలకు పైగా గడిచినా, సైనికుడిని తిరిగి ఇవ్వడంపై పాకిస్థాన్ నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాలేదు.
West Bengal : పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా లెదర్ కాంప్లెక్స్‌లో మ్యాన్‌హోల్ శుభ్రం చేస్తుండగా కాలువలో పడి ముగ్గురు కార్మికులు ఆదివారం మరణించారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది.
RG Kar Case : గతేడాది ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆసుపత్రిలో ఒక మహిళా వైద్యురాలిపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు. సోమవారం సీల్దా కోర్టు ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్ కు జీవిత ఖైదు విధించింది.
West Bengal : భార్యాభర్తల బంధం అనేది చాలా ప్రత్యేకమైనది. రెండు వేరు వేరు స్వభావాలు కలిగిన మనస్సులు పెళ్లి అనే బంధంతో ఒక్కటవుతాయి. ఇక దంపతుల మధ్య ఉండే ప్రేమానుబంధాలు చాలా ప్రత్యేకం.
Smuggling : పశ్చిమ బెంగాల్‌లో మే 25న ఆరో దశ పోలింగ్ ముగిసింది. ఈ సమయంలో బీఎస్ఎఫ్ జవాన్లు గొప్ప విజయాన్ని సాధించారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో వరుసగా మూడో రోజు.. మరో స్మగ్లర్‌ను బీఎస్‌ఎఫ్ అరెస్ట్ చేసింది.
Mamata Banerjee : ప్రస్తుతం మమతా బెనర్జీ కష్టాల్లో కూరుకుపోయింది.. అందుకే ఆమె తన ఉనికిని, పార్టీని, నాయకులను కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది.