స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో నేటి నుంచి జనవరి 23వ తేదీ వరకు ఐదు రోజుల పాటు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం పాల్గొంటోంది. ఈ అంతర్జాతీయ వేదికపై ‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047’ డాక్యుమెంట్‌ను సీఎం రేవంత్ రెడ్డి బృందం ప్రదర్శించనుంది. రాష్ట్ర అభివృద్ధి కోసం రూపొందించిన లక్ష్యాలను, భవిష్యత్ ప్రణాళికలను ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ప్రతినిధులకు వివరించడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి…