తెలంగాణ రాష్ట్రంలో చలి వణికిస్తోంది. రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలతో జనాలు బయటకు రావడానికి జంకుతున్నారు. సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్దిరోజులుగా చలి తీవ్రత కాస్త తగ్గిడంతో ఊపిరి పీల్చుకున్న రాష్ట్ర ప్రజలకు మళ్లీ చలి గజగజ వణికిస్తోంది.
హైదరాబాద్‌లో మరోసారి వరుణుడు తన ప్రతాపాన్ని చూపించాడు. ఇవాళ ఉదయం నుంచి కురిసిన వర్షానికి నగరవాసులు తడిసిముద్దయ్యారు. భారీ వర్షం వల్ల రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లపైకి నీరు రావడంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
తెలంగాణలో గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తడిసి ముద్దవుతున్న రాష్ట్ర ప్రజలకు మరో షాక్ తగలనుంది. తెలంగాణాకు రాగల మూడు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల ఈ మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు…
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. పశ్చిమ బెంగాల్ తీరం డిగాకు సమీపంలో ఈ వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. తీరం దాటిన తర్వాత కూడా మరో 24గంటలు వాయుగుండంగానే ప్రయాణం చేయనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
వాయవ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరానికి ఆనుకుని ఉన్న ఈ తీవ్ర అల్పపీడనం.. రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.