ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట దేవుని గుట్ట తండాలో ఎండిపోయిన వరిపొలాలను మాజీ మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేసీఆర్ కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకువచ్చి మల్కపేట రిజర్వాయర్ లో పోస్తే.. దేవుని గుట్ట తండాలోని రైతులు వ్యవసాయం చేశారు. కేసీఆర్ మీద ఉన్న కోపం, ద్వేషంతో మేడిగడ్డలో జరిగిన కుట్రపూరిత ప్రమాదాన్ని సాకుగా చూపించడంతో రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండిపోతున్నాయి.
దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళతో పాటు తమిళనాడు రాష్ట్రాల్లో రిజర్వాయర్లలో నీటి నిల్వలు రోజు రోజుకు పడిపోతున్నాయని సీబ్ల్యూసీ తెలిపింది.
అగ్రరాజ్యం అమెరికాను నీటి కష్టాలు వెంటాడుతున్నాయి.. దాదాపు 10 రాష్ట్రాలను తాకాయి సాగు నీటి కష్టాలు.. లేక్ మీడ్ జలాశయంలో నీరు అడుగంటి పోయిందని తొలిసారి అంగీకరించింది యూఎస్… ఆ జలాశయంలో 10 అడుగుల మేరకు పడిపోయింది నీటిమట్టం.. అయితే, ఇది కొన్ని రాష్ట్రాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.. ఈ వ్యవహారంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై కూడా ఒత్తిడి పెరిగింది.. తమ రాష్ట్రాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించాలని, దీని కింద ఆర్థిక సహాయం అందించాలని…