అగ్రరాజ్యం అమెరికాను నీటి కష్టాలు వెంటాడుతున్నాయి.. దాదాపు 10 రాష్ట్రాలను తాకాయి సాగు నీటి కష్టాలు.. లేక్ మీడ్ జలాశయంలో నీరు అడుగంటి పోయిందని తొలిసారి అంగీకరించింది యూఎస్… ఆ జలాశయంలో 10 అడుగుల మేరకు పడిపోయింది నీటిమట్టం.. అయితే, ఇది కొన్ని రాష్ట్రాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.. ఈ వ్యవహారంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై కూడా ఒత్తిడి పెరిగింది.. తమ రాష్ట్రాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించాలని, దీని కింద ఆర్థిక సహాయం అందించాలని జో బైడెన్ సర్కార్‌ను కోరుతున్నారు 10 రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు. ఇక, నీటి కొరత కారణంగా అరిజోనా, నవాడా, మెక్సికోకు అందించే నీటిలో కోత విధించే అవకాశాలు కూడా ఉన్నాయని యూఎస్ బ్యూరో ఆఫ్ రిక్లమేషన్ ప్రకటించింది.
అయితే, చరిత్రలో అతిపెద్ద కరువుగా పేర్కొంటున్నారు అమెరికాలోని 10 రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు.. నీటి కరువును ఎదుర్కొనేందుకు ఆర్థికంగా సాయం అందించాలని నివేదించారు.. నీటి కరువు కారణంగా మొత్తం పంటలు నాశనమయ్యాయని వారు తెలిపారు.. ఫలితంగా అనేక ఇతర సమస్యలు కూడా తలెత్తవచ్చునని వారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇక, ఇప్పటికే సాగునీటి కష్టాలు ఆయా రాష్ట్రాలను వెంటాడుతుండగా.. రానున్న రోజుల్లో తాగునీటికి కూడా కటకట ఏర్పడే అవకాశం ఉందనే హెచ్చరికలు కూడా ఉన్నాయి.