పేరుకే అది ఒంగోలు నగర పాలక సంస్థ. నగరంలో మూడు-నాలుగు రోజులకు ఒక సారే నీళ్లిస్తారు. అది కూడా అర్థరాత్రి దాటాకే. ఇక శివారు ప్రాంతాలకు అరకొర ట్యాంకర్లే గతి. దీంతో గుక్కెడు మంచినీళ్ల కోసం అవస్థలు పడాల్సివస్తోంది. మూడు లక్షలకు పైగా జనాభా ఉన్న ఒంగోలు నగరంలో ఈ దుస్థితి ఇంకెన్నాళ్ళు అంటున్నారు ప్రజలు. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మంచినీటి కోసం జనం జాగారాలు చేయాల్సి వస్తోంది. ఒంగోలు నగరంలో…