ఉగ్రవాదులకు ప్రధాన స్థావరాలైన బహావల్‌పుర్, మురుద్కేపై భారత సైన్యం మెరుపు దాడి చేసి బీభత్సం సృష్టించింది అని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదులు, ఉగ్రవాద సానుభూతిపరులకు భారత్ ఏం చేస్తుందో క్లియర్ గా చెప్పింది అన్నారు. పాకిస్తాన్ గర్వంగా చెప్పుకునే డ్రోన్లు, మిసైల్లను పూర్తిగా ధ్వంసం చేశాం.
ఉగ్రవాదులను మట్టిలో కలిపేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. దేశ మహిళల సింధూరాన్ని దూరం చేస్తే ఏం జరుగుతుందో పాకిస్తాన్ కు చూపించాం అని చెప్పుకొచ్చారు. ఆపరేషన్ సింధూర్ ఒక పేరు కాదు.. ఒక ఆవేదన.. ఆపరేషన్ సింధూర్ న్యాయం కోసం చేసిన ఓ ప్రతిజ్ఞ అని కొనియాడారు.