స్వదేశంలో బ్యాటింగ్, బౌలింగ్‌లో బెబ్బులిలా చెలరేగే భారత్.. దక్షిణాఫ్రికాకు సిరీస్‌ను కోల్పోవడం ఇక లాంఛనమే. మొదటి టెస్టులో దారుణ ఓటమిని చవిచూసిన టీమిండియా.. రెండో టెస్టులోనూ ఓటమి దిశగా సాగుతోంది. మొదటి ఇన్నింగ్స్‌లో ప్రొటీస్ టీమ్ 489 రన్స్ చేయగా.. భారత్ 201 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 26 రన్స్ చేయగా.. 314 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలుంది. టీమిండియాకు 400 రన్స్ లక్ష్యంను విధించే అవకాశం ఉంది.…
మరికాసేపట్లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మొదటి టెస్ట్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ప్రొటీస్ కెప్టెన్ టెంబా బావుమా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తమ బ్యాటర్లు మంచి ఫామ్ మీదున్నారని, అందుకే ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నానని బావుమా చెప్పాడు. పిచ్ కాస్త పొడిగా కనిపిస్తోందని, మొదటి ఇన్నింగ్స్‌లో పరుగులు చాలా కీలకం అని పేర్కొన్నాడు. కగిసో స్థానంలో కార్బిన్ ఆడుతున్నడని బావుమా చెప్పాడు. ఫాస్ట్ బౌలర్లకు పిచ్ సహకరించనుందని టీమిండియా…
IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని జట్ల మధ్య ట్రేడ్ చర్చలు వేగంగా సాగుతున్నాయి. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తమ స్పిన్ విభాగాన్ని బలోపేతం చేయడానికి గుజరాత్ టైటాన్స్ (GT) ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను తమ జట్టులోకి తీసుకువాలనే ప్రయత్నం చేసింది. అయితే, గుజరాత్ టైటాన్స్ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. అందిన రిపోర్ట్స్ ప్రకారం.. ఈ రెండు జట్ల మధ్య సుందర్ ట్రేడ్‌పై చర్చలు ప్రారంభమయ్యాయి. చెన్నై…
ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా క్వీన్స్‌లాండ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 48 పరుగుల తేడాతో కంగారులను చిత్తు చేసింది. భారత్ నిర్ధేశించిన 168 రన్స్ ఛేదనలో ఆసీస్ 18.2 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ (30) టాప్ స్కోరర్. మాథ్యూ షార్ట్ (25) మినహా మిగతా కంగారో బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3 వికెట్స్ పడగొట్టగా.. అక్షర్ పటేల్,…
IND vs SA: హోబార్ట్ వేదికగా జరిగిన భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. టార్గెట్ 187 పరుగులను భారత్ 18.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి పూర్తి చేసి మ్యాచ్‌ను 5 వికెట్ల తేడాతో గెలుచుకుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. ప్రారంభంలో అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌తో భారత బౌలర్లు దూకుడు ప్రదర్శించారు. మొదటి మూడు…
India vs WI: భారత్, వెస్టిండీస్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా గురువారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో తొలి మ్యాచ్ ప్రారంభమైంది. తొలి రోజు ఆటలో భారత్ ఆధిపత్యం చెలాయించింది. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ మొదటి రోజు ముగించే సరికి.. రెండు వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. కెఎల్ రాహుల్ అర్ధ సెంచరీ సాధించి నాటౌట్‌గా నిలిచాడు. సిరాజ్ నాలుగు వికెట్లు, బుమ్రా మూడు…
యూఏఈ వేదికగా ఆసియా కప్ 2025 జరుగుతోంది. భారత్ తొలి మ్యాచ్‌లో యూఏఈపై ఘన విజయాన్ని సాధించింది. ఇక సెప్టెంబర్ 14న పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు టీమిండియాసిద్ధమవుతోంది. ఈ మ్యాచ్‌కు ముందు స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ జట్టును వీడాడు. ఆసియా కప్ జట్టులో రిజర్వ్ ఆటగాడిగా ఉన్న సుందర్.. టోర్నమెంట్ మధ్యలోనే జట్టును వీడి ఇంగ్లండ్‌కు బయలుదేరారు. ఇంగ్లండ్ ప్రసిద్ధ కౌంటీ జట్టు హాంప్‌షైర్‌లో అతడు చేరాడు. 2025 ఛాంపియన్‌షిప్‌లో చివరి రెండు మ్యాచ్‌లు సుందర్ ఆడనున్నాడు.…
IND vs ENG Test: లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత జట్టు తడబడింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కీలకమైన 6 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది టీమిండియా.
ఇంగ్లండ్‌తో జరిగిన లార్డ్స్ టెస్ట్ మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ బంతితో అద్భుతంగా రాణించాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఆఫ్ స్పిన్నర్ సుందర్ 22 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. సుందర్ చెలరేగడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 192 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే ఐదవ రోజు భారత్ ఛేదనలో వాషీ బ్యాట్‌తో రాణించలేకపోయాడు. రెండవ ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవలేదు. నాలుగు బంతులను బంతులను ఆడిన సుందర్.. ఒక్క పరుగు కూడా చేయలేదు. Also…
ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌కు చుక్కలు చూపించిన భారత్ చారిత్రక విజయం అందుకున్న విషయం తెలిసిందే. 608 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 271 పరుగులకు ఆలౌటవ్వడంతో.. టీమిండియా 336 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. భారత జట్టు విజయంలో శుభ్‌మన్ గిల్ (269, 161), ఆకాశ్ దీప్ (10 వికెట్స్) కీలక పాత్ర పోషించారు. అయితే ఎడ్జ్‌బాస్టన్ టెస్టును మలుపు తిప్పింది రవీంద్ర జడేజా అనే చెప్పాలి. ఐదవ రోజు లంచ్‌కు ముందు ఏం…