T20 World Cup 2026: వాషింగ్టన్ సుందర్ అవుట్.. ఐపీఎల్ స్టార్‌కు అవకాశం!
- టీమిండియాకు భారీ పెద్ద ఎదురుదెబ్బ
- వాషింగ్టన్ సుందర్ అవుట్
- ఐపీఎల్ స్టార్‌కు అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 వరల్డ్‌కప్ 2026 ముందు టీమిండియాకు భారీ పెద్ద ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ వరల్డ్‌కప్‌కు దూరమయ్యే ఛాన్సెస్ మెండుగా ఉన్నాయి. ఫిట్‌నెస్ కారణంగా అతడు మెగా టోర్నీకి అందుబాటులో ఉండడం లేదని తెలుస్తోంది. దీంతో భారత జట్టులో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుందర్ స్థానంలో యువ ఆటగాడు రియాన్ పరాగ్‌ను ఎంపిక చేయాలని సెలెక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం.
వాషింగ్టన్ సుందర్ గత కొన్నేళ్లుగా టీ20 ఫార్మాట్‌లో టీమిండియాకు కీలక ఆటగాడిగా ఉన్నాడు. పవర్‌ప్లేలో కట్టుదిట్టమైన స్పిన్ బౌలింగ్‌తో పాటు అవసరమైనప్పుడు వేగంగా పరుగులు సాధించే సామర్థ్యం అతడి సొంతం. ముఖ్యంగా విదేశీ పిచ్‌లపై కూడా మెరుగైన ప్రదర్శన చేశాడు. అలాంటి సుందర్ టీ20 వరల్డ్‌కప్‌కు దూరం కావడం భారత జట్టుకు నష్టం అనే చెప్పాలి. సుందర్ ఇప్పట్లో మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించే అవకాశం లేనట్లు తెలుస్తోంది. పూర్తిగా ఫిట్‌గా మారడానికి మరో రెండు వారాల సమయం పట్టొచ్చు. ఈ నేపథ్యంలో సుందర్ స్థానంలో రియాన్ పరాగ్‌ను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి.
Also Read
- Dhoni-Rohit: ధోనీని చూసి భయపడ్డా.. రోహిత్ సూపర్.. టీమిండియా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Harbhajan Singh: అతడు మరింత పదునెక్కుతున్నాడు.. ఈ వయసులోనే ఆ ఘనతలు అసాధ్యం!
- 2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
- ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
Also Read: IND vs NZ 4th T20: నేడు విశాఖలో నాలుగో టీ20.. సంజు శాంసన్ సంగతి ఏంటి?
ఐపీఎల్‌తో పాటు ఇటీవల దేశవాళీ టోర్నీల్లో రియాన్ పరాగ్ నిలకడైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్‌లో దూకుడుతో పాటు పార్ట్‌టైమ్ స్పిన్ బౌలింగ్‌తో కూడా జట్టుకు ఉపయోగపడనున్నాడు. టీ20 వరల్డ్‌కప్ 2026 ముందర టీమిండియా యువ ఆటగాళ్లపై బీసీసీఐ ఎక్కువగా దృష్టి సారిస్తోంది. రియాన్ పరాగ్‌కు ఇది కెరీర్‌లో అతిపెద్ద అవకాశం అనే చెప్పాలి. ఒకవేళ అతడు జట్టులో చోటు దక్కించుకుంటే.. మిడిలార్డర్‌లో భారత జట్టుకు అదనపు బలం చేకూరే అవకాశముంది.
తాజావార్తలు
-
Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ రూమర్లు నిజమేనా?
-
Jantar Mantar Protest 2026: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు.. పలువురు నిరసనకారులు అదుపులోకి
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే అరెస్ట్..? ‘చాయ్ తాగుదాం రండి’ అంటూ..
-
AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
-
RC17 : రామ్ చరణ్ – సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?