వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వరుసకు అన్నా-చెల్లెలు ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకునేందుకు యత్నించినట్లు సమాచారం. పెద్దలు నిరాకరించడంతో చెరువులో దూరి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
తెలంగాణలో పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. కాగా.. పోలింగ్ రాష్ట్రమంతటా ప్రశాంతంగా జరగ్గా, కొన్నిచోట్ల మాత్రం చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా.. వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్-కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ తలెత్తింది. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా పరకాల మండలం నాగారంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలింగ్ సెంటర్ దగ్గర బీఆర్ఎస్-కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో.. ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. అక్కడే…
వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన పర్వతగిరి మండలం మోత్య తండాలో జరిగింది. విద్యుత్ షాక్ కు గురైన వారిలో మొత్తం నలుగురు యువకులు ఉన్నారు. కాగా.. మొదటగా భూక్యా దేవేందర్ అక్కడికక్కడే మృతి చెందగా.. గాయాలతో ఉన్న సునీల్, రవిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు.
Warangal Accident: వరంగల్ జిల్లాలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మనవడికి వెంట్రుకలు తీసేందుకు వేములవాడ వెళ్లి ఇంటికి వెళ్తున్న కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం ధ్వంసం చేసింది.
Warangal Bund: నేడు వరంగల్ బంద్ కు Kuc విద్యార్థులు పిలుపునిచ్చారు. Kuc పీహెచ్డీ అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయని, వాటిని పరిష్కరించాలని విద్యార్థులు చేసిన డిమాండ్లను పట్టించుకోకపోవడం లేదని కేయూసి విద్యార్థి జెఎసి బంద్ కు పిలుపు నిచ్చారు.
వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర ఇవాల్టి నుంచి మళ్లీ ప్రారంభం కానుంది. ఎక్కడైతే తనను అరెస్ట్ చేశారో అక్కడినుంచే ఆమె పాదయాత్ర మొదలు పెట్టనున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట లింగగిరి నుంచి పాదయాత్ర కొనసాగిస్తారు.
నేటి నుంచి వరంగల్ మార్కెట్ ప్రారంభం అవుతుందని, అధ్వాన్న గోనె సంచులు, యూరియా బస్తాలు తప్ప అన్ని సంచుల కోసం రైతులకు 30 రూపాయలు చెల్లించేందుకు వ్యాపారస్తులు అంగీకరించారని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
ఆ జిల్లాలో సగంమంది ఎమ్మెల్యేలను సర్వే టెన్షన్ పెడుతోందా? పార్టీ చేపట్టిన వడపోత.. ఉక్కపోతగా మారి ఉక్కిరి బిక్కిరి అవుతోంది ఎవరు? సిట్టింగ్‌లు ఆందోళన చెందుతుంటే.. ఆశావహులు హుషారుగా ఉన్నారా? ఇంతకీ ఏంటా జిల్లా? లెట్స్ వాచ్..! మేము సిట్టింగులం.. అధినేతకు అనుకూలంగా ఉన్నాం.. మాకెలాంటి ఢోకా లేదని ఇన్నాళ్లూ కాలం వెళ్లదీసిన MLAలకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొదవ లేదు. అలాంటి వారంతా ప్రస్తుతం సర్వే మాట చెప్పగానే ఉలిక్కి పడుతున్నారట. ఒక్కసారిగా మారిన రాజకీయంతో…
కామాంధులు కన్నుమిన్ను ఎరగకుండా దారుణాలకు ఒడిగడుతూనే ఉన్నారు.. ఇలాంటి ఘటనలపై కేసులు నమోదు చేస్తున్నా.. కఠిన శిక్షలు అమలు చేస్తున్నా… నిత్యం ఏదో ఒక చోట మాత్రం అత్యాచార ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి.. తాజాగా, ఓ దుర్మార్గుడు.. ఓ మహిళపై కన్నేశాడు.. పొలాల్లోకి లాక్కెళ్లి.. అత్యాచారం యత్నం చేశాడు.. ఇక, మహిళ గట్టిగా కేకలు వేయడంతో.. మహిళను కాపాడేందుకు వెళ్లాడు.. ఆమె భర్త.. దీంతో.. బాధితురాలి భర్తపై దాడి చేసిన నిందితుడు.. అతడిని తీవ్రంగా గాయపర్చి.. అక్కడి…
ఈ ఏడాది మిర్చి రైతులకు కలిసివచ్చింది. దీంతో రైతులకు మద్దతు ధరకు మించిన ధరలు లభిస్తున్నాయి. అంతేకాకుండా మిర్చి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తాజాగా వరంగల్ జిల్లా ఎనుమాముల మార్కెట్లో క్వింటాల్ దేశీయ రకం మిర్చి ధర ఏకంగా రూ.44వేలు పలికింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన రైతు నాగేశ్వరరావు తీసుకువచ్చిన మిర్చిని జితిన్ ట్రేడింగ్ కంపెనీ క్వింటాల్కు రూ. 44 వేలు చెల్లించి కొనుగోలు చేసింది. కొద్ది రోజుల…