Warangal: గ్రేటర్ వరంగల్ లో అంతర్ రాష్ట్ర దొంగల ముఠాలు రెచ్చిపోతున్నాయి. ప్రత్యేక పరికరాలు ఉపయోగించి డోర్ హ్యాండిళ్లు, తాళాలు పగులగొట్టి అందినకాడికి దోచుకుంటున్నారు. గత రెండు రోజులుగా గ్రేటర్ పరిధిలో 10 దొంగతనాలు జరగడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.