వక్ఫ్ సవరణ బిల్లుపై శుక్రవారం జరిగిన పార్లమెంటరీ కమిటీ సమావేశంలో దుమారం రేగింది. ముసాయిదా బిల్లులో ప్రతిపాదించిన మార్పులను అధ్యయనం చేసేందుకు తగిన సమయం ఇవ్వడం లేదని విపక్ష సభ్యులు ఆరోపించారు. వక్ఫ్ సవరణ బిల్లుపై... జాయింట్ కమిటీ కాశ్మీర్ మత గురువు మిర్వాయిజ్ ఒమర్ ఫరూక్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం అభిప్రాయాలను వినేందుకు సిద్ధమైంది. మిర్వాయిజ్‌ను పిలవడానికి ముందు.. కమిటీ సభ్యులు తమలో తాము చర్చించుకున్నారు. అనంతరం ప్రతిపక్ష నాయకులు సమావేశంలో గందరగోళం సృష్టించారు. ఢిల్లీ…
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీపై ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 26ను ఉటంకిస్తూ వక్ఫ్ ఆస్తుల విషయంలో ప్రభుత్వ ఉద్దేశాలను ఆయన ప్రశ్నించారు. “మత సమూహాలకు.. వారి మత, ధార్మిక ప్రయోజనాల కోసం సంస్థలను స్థాపించి.. ఆ సంస్థలను వారే ముందుకు తీసుకెళ్లే హక్కును ఆర్టికల్ 26 ఇస్తుంది." అని చెప్పారు. ప్రధాని మోడీ వక్ఫ్‌కు రాజ్యాంగంతో సంబంధం లేదని చెప్పారు.. ఒక్కసారి ఆర్టికల్ 26ను చదవండి అని…
Waqf Bill: వక్ఫ్ (సవరణ) బిల్లుపై జాయంత్ పార్లమెంటరీ కమిటీ పదవీ కాలాన్ని వచ్చే ఏడాది పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల చివరిరోజు వరకు పొడగిస్తూ లోక్‌సభలో గురువారం తీర్మానాన్ని ఆమోదించారు. కమిటీ చైర్మన్, బీజేపీ నేత జగదాంబిక పాల్ లోక్‌భలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మూజువాణి ఓటుతో దీనిని ఆమోదించారు.
Waqf bill: వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని మరింత కాలం పొడగించే అవకాశం కనిపిస్తోంది. వక్ఫ్ బిల్లులోని వివాదాస్పద ప్రతిపాదనల్ని సవరించేందుకు ఈ ఏడాది వర్షాకాల పార్లమెంటరీ సమావేశాల్లో కేంద్రం ఈ బిల్లును తీసుకువచ్చింది. బిల్లుపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కేంద్రం జేపీసీని ఏర్పాటు చేసింది. కమిటీలో అధికార, ప్రతిపక్షాల ఎంపీలు భాగస్వాములుగా ఉన్నారు.
నవంబర్ 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 20 వరకు కొనసాగుతాయి. ఈ సందర్భంగా పలు కీలక బిల్లులపై చర్చ జరగనుంది. నవంబర్ 26న, రాజ్యాంగం 75వ వార్షికోత్సవం సందర్భంగా, పార్లమెంటు ఉభయ సభలను పార్లమెంట్ హౌస్ సెంట్రల్ హాల్‌లో నిర్వహించవచ్చు. శీతాకాల సమావేశాల్లో వన్ నేషన్-వన్ ఎలక్షన్, వక్ఫ్ బిల్లుపై పెద్ద దుమారమే రేగే అవకాశం ఉంది. వన్ నేషన్-వన్ ఎలక్షన్ నివేదికను కేబినెట్ ఆమోదించిన తర్వాత శీతాకాల…
వక్ఫ్ (సవరణ) బిల్లుపై దర్యాప్తు చేస్తున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఛైర్మన్ ఏకపక్ష నిర్ణయాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రతిపక్షాలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశాయి. తాము జేపీసీ నుంచి తప్పుకోవాల్సి వస్తుందని విపక్ష ఎంపీలు హెచ్చరించారు. లోక్‌సభ వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లును పరిశీలించే బాధ్యతను జగదాంబిక పాల్ నేతృత్వంలోని జేపీసీకి అప్పగించిన విషయం తెలిసిందే.
విజయవాడలో వక్ఫ్ పరిరక్షణ మహా సభలో వైసీపీ నేత విజయసాయి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లిం సంప్రదాయాలకు విరుద్దంగా వక్ఫ్ సవరణ బిల్లును వైసీపి వ్యతిరేకిస్తోందని అన్నారు. వైఎస్ జగన్ ఎప్పుడూ ముస్లింలకు అండగా నిలుస్తారని తెలిపారు.
Waqf Amendment Bill : వక్ఫ్ సవరణ బిల్లు గురించి కొద్ది రోజులుగా దేశమంతటా చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ బిల్లును జేపీసీకి పంపగా అక్కడ గందరగోళ పరిస్థితులు తలెత్తాయి.
Waqf bill: కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు బిల్లును తీసుకువచ్చింది. ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశంలో మరోసారి సభ ముందుకు ఈ బిల్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) చర్చిస్తోంది. ఇదిలా ఉంటే, తాజాగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డ్(AIMPLB) అధ్యక్షుడు మౌలానా ఖలీద్ సైఫుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎలాగైనా వక్ఫ్ అమలుని నిలిపేస్తామని, దాని కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా వెనకాడరు’’ అని అన్నారు. కాన్పూర్‌లో జరిగిన…
Waqf bill: వక్ఫ్ (సవరణ) బిల్లుని పరిశీలించేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే, మంగళవారం జేపీసీ సమావేశంలో బీజేపీ ఎంపీలు, ప్రతిపక్షల ఎంపీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బీజేపీ ఎంపీలు తమపై అభ్యంతరకరమైన పదజాలాన్ని ఉపయోగించినట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీంతో వరసగా రెండో రోజు కూడా ప్రతిపక్ష పార్టీల ఎంపీలు వాకౌట్ చేశాయి.