నవంబర్ 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 20 వరకు కొనసాగుతాయి. ఈ సందర్భంగా పలు కీలక బిల్లులపై చర్చ జరగనుంది. నవంబర్ 26న, రాజ్యాంగం 75వ వార్షికోత్సవం సందర్భంగా, పార్లమెంటు ఉభయ సభలను పార్లమెంట్ హౌస్ సెంట్రల్ హాల్‌లో నిర్వహించవచ్చు. శీతాకాల సమావేశాల్లో వన్ నేషన్-వన్ ఎలక్షన్, వక్ఫ్ బిల్లుపై పెద్ద దుమారమే రేగే అవకాశం ఉంది. వన్ నేషన్-వన్ ఎలక్షన్ నివేదికను కేబినెట్ ఆమోదించిన తర్వాత శీతాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
READ MORE: Odisha: మరీ ఇంత దారుణమా? గిరిజన యువతిపై అసభ్య ప్రవర్తన.. మానవ మలాన్ని నోటిలో..
కాగా.. ఈ సమావేశాల్లో ‘వక్ఫ్ సవరణ బిల్లు-2024’ చర్చకు రానుంది. లోక్‌సభ సచివాలయం బుధవారం విడుదల చేసిన బులిటెన్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఆగస్టు 8న సభ ముందు ప్రవేశపెట్టిన ఈ బిల్లును ఆ మరుసటి రోజు జాయింట్ కమిటీ అధ్యయనం కోసం పంపారు. శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి వారం చివరి రోజు కమిటీ నివేదికను పార్లమెంటుకు సమర్పించాలని ఇదివరకే నిర్దేశించిన విషయం విదితమే. అందువల్ల జాయింట్ కమిటీ తన నివేదికను 29లోపు సభ ముందు ప్రవేశపెట్టే అవకాశముంది. ఆ తర్వాత ఇందుకు సంబంధించిన బిల్లుపై సభలో చర్చించి ఆమోదించనున్నారు.
READ MORE:Side Effects of Over Sitting: ఎక్కువ సేపు కూర్చుంటున్నారా? .. ఎంత ప్రమాదమంటే?
కాగా.. వక్ఫ్ బోర్డు అపరిమిత అధికారాలు తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘‘వక్ఫ్ సవరణ బిల్లు 2024’’ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ బిల్లుపై ప్రతిపక్షాలు రాద్దాంతం చేయడంతో దీన్ని పునఃపరిశీలించేందుకు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో ‘‘జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)’’ ఏర్పాటు చేశారు. జేపీసీ కమిటీ ఛైర్మన్‌గా బీజేపీ నేత జగదాంబికా పాల్ వ్యవహరించారు. ఈ క్రమంలో వచ్చే శీతాకాల సమావేశాల్లో భాగంగా నివేదిక అందించాలని గడువు విధించారు. ఇక, కమిటీలో 21 మంది లోక్‌సభ, 10 మంది రాజ్యసభ సభ్యులకు చోటు కల్పించారు. పలు చర్చల అనంతరం ఈ బిల్లు ఇప్పుడు పార్లమెంట్‌లో చర్చకు రానుంది.