Waqf Amendment Act: వక్ఫ్ సవరణ చట్టం 2025 రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఈరోజు (మంగళవారం) విచారించనుంది. ఈ విషయంలో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.
Waqf Act: కేంద్రం తీసుకువచ్చిన వక్ఫ్ చట్టం అమలుపై పాక్షికంగా లేదా పూర్తిగా స్టే విధించడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తామని ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకి తెలిపింది. శుక్రవారం మధ్యాహ్నం దాఖలు చేసిన పిటిషన్‌లో.. ఇలాంటి కేసుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా చట్టబద్ధమైన నిబంధనల్ని నిలిపేసే అధికారం కోర్టులకు లేదని, చట్టంలో అలా లేదని ప్రభుత్వం వాదించింది. ‘‘పార్లమెంట్ చేసిన చట్టాలకు రాజ్యాంగబద్ధత ఉంది. మధ్యంతర స్టే అనేది అధికారాల సమతుల్యత సూత్రానికి విరుద్ధం’’ అని పేర్కొంది. ఉమ్మడి పార్లమెంటరీ…
BJP MP: వక్ఫ్ సవరణ చట్టంపై విచారణ, రాష్ట్రపతికి బిల్లుల విషయంలో సుప్రీంకోర్ట్ డెడ్‌లైన్ విధించడం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారంపై బీజేపీలోకి కొంత మంది సుప్రీంకోర్టుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే, సుప్రీంకోర్టుపై బహిరంగంగానే తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
MLA Raja Singh: జనాలను రెచ్చగొట్టడానికే ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మీటింగ్ పెట్టారు అని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు. ఒవైసీ నీకు దమ్ముంటే ఈ రోజు మీటింగ్ లో నిజం చెప్పు అని అడిగారు.
బెంగాల్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. భారీగా ముస్లింలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. వక్ఫ్ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దక్షిణ 24 పరగణాలులో పెద్ద ఎత్తున ముస్లింలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. దీంతో భారీగా బలగాలు మోహరించారు. అల్లర్లు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
Waqf Act: ఈ రోజు నుంచి వక్ఫ్ సవరణ చట్టం-2025 అమలులోకి వచ్చింది. గత వారం పార్లమెంట్ వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ రోజు (ఏప్రిల్ 8, 2025) నుంచి అమలులోకి వచ్చినట్లు నోటిఫికేషన్ జారీ చేసింది.
Waqf Row: వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం నాడు వక్ఫ్ చట్టానికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా మద్దతు ప్రకటించిన మణిపూర్ బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు ఎండి అస్కర్ అలీ ఇంటికి సుమారు 8 వేల మందితో కూడిన ఓ గూంపు వెళ్లి నిప్పు పెట్టింది.
Waqf Act: వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకునే వరకు దేశవ్యాప్తంగా నిరసనలకు నాయకత్వం వహిస్తామని ‘‘ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డ్(AIMPLB) తెలిపింది. అన్ని మత, సామాజిక సంస్థల సమన్వయంతో ఈ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరించింది. పార్లమెంట్‌లో బిల్లుకు మద్దతు ఇచ్చిన ఎన్డీయే కూటమి భాగస్వామ్య పక్షాలైన జేడీయూ, టీడీపీ, ఎల్‌జేపీలను విమర్శిస్తూ.. ఆ పార్టీల లౌకిక ముసుగు తొలగిపోయిందని పేర్కొంది.