గత మూడు సినిమాలు ఆశించిన స్థాయిలో హిట్ అవ్వకపోవడంతో యాంటి ఫాన్స్ నుంచి చిరు పని అయిపొయింది అనే మాట వినిపించడం మొదలయ్యింది. ఇలాంటి మాటలని గత ముప్పై అయిదు సంవత్సరాలుగా వింటూనే ఉన్న చిరు, తన పని అయిపొయింది అనే మాట బయటకి వచ్చిన ప్రతిసారీ దాన్ని పాతాళంలో పాతేసే రేంజ్ హిట్ కొట్టాడు. ఎప్పుడూ చేసే లాగే ఈసారి కూడా తనపై వస్తున్న కామెంట్స్ ని అదఃపాతాళంలో పాతేసాడు చిరు. సంక్రాంతి పండగని ఒకరోజు…