Mallikarjun Kharge: హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్(ఈవీఎం)లపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మంగళవారం మాట్లాడుతూ.. ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్‌ని ఉపయోగించాలని సూచించారు.