శ్రీరామనవమి రోజున దేశ వ్యాప్తంగా ఉన్న రామాలయాలల్లో సీతారాముల కళ్యాణంను అంగరంగ వైభవంగా జరిపిస్తారు.. ప్రత్యేక భజనలు, రాముని ఊరేగింపులతో ఊరువాడా సందడి వాతావరణం నెలకొంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లోని ఒక్క ప్రాంతంలో మాత్రం రాముడి కళ్యాణంను నవమి తర్వాత తొమ్మిదో రోజూ జరిపిస్తారు.. అందుకు కారణాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.. అసలు నిజానిజాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఒకప్పుడు ఆంధ్రా, తెలంగాణ కలిసి ఉన్నప్పుడు భద్రాచలంను ఎక్కువగా సందర్శించేవారు.. రెండు రాష్ట్రాలుగా…
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో రేపు(శుక్రవారం) కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయంలో ఏప్రిల్ 17 నుండి 25వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇప్పటికే టీటీడీ (TTD) అన్నీ ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ సందర్భంగా రేపు తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలుపుతారు. అనంతరం ఉదయం 8 నుండి 11.30 గంటల వరకు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది.
CM Jagan Vontimitta Visit Cancelled: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి షెడ్యూల్ ప్రకారం ఇవాళ ఒంటిమిట్టలో పర్యటించాల్సి ఉంది.. కానీ, కాలికి గాయం కావడంతో ఆ పర్యటన వాయిదా వేసుకున్నారు.. కాలినొప్పితో బాధపడుతున్నారు సీఎం జగన్.. మంగళవారం ఉదయం ఎక్సర్‌సైజ్ చేస్తున్న సమయంలో కాలు బెణికింది.. అయితే.. సాయంత్రానికి నొప్పి తీవ్రత పెరిగింది.. గతంలోనూ ఇలానే కాలికిగాయం కావడంతో.. చాలా రోజుల పాటు ఇబ్బంది పడ్డారు ముఖ్యమంత్రి.. అయితే, తాజాగా మళ్లీ కాలినొప్పి తీవ్రం కావడంతో..…
CM YS Jagan: ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.. ఐదవ రోజు మోహినీ అలంకారంలో దర్శనం ఇస్తున్నారు కోదండ రాముడు.. ఇక, రాత్రి గరుడ వాహనంపై ఊరేగనున్నారు ఒంటిమిట్ట రాముడు.. మరోవైపు సీతారాముల కళ్యాణోత్సవానికి భక్తుల సౌకర్యార్థం 118 ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసింది ఏపీఎస్ ఆర్టీసీ.. మరోవైపు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు అనగా బుధవారం ఒంటిమిట్టను సందర్శించనున్నారు.. సీఎం వైఎస్ జగన్ ఒంటిమిట్ట పర్యటనకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చే…
కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో సీతారామ కల్యాణోత్సవం కన్నులపండువగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కడప ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఒంటిమిట్ట చేరుకున్న ఆయన కోదండరామస్వామి ఆలయానికి విచ్చేశారు. తొలుత సంప్రదాయ బట్టల్లో స్వామి వారిని దర్శించుకుని అక్కడి నుంచి నేరుగా స్వామి వారి కళ్యాణ వేదికకు చేరుకున్నారు. సీఎం జగన్‌కు మంత్రి రోజా, అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను…
ఇవాళ కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయంలో సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు.. ఇక, ఈ రోజు కడప జిల్లాలో పర్యటించనున్న సీఎం వైఎస్ జగన్మ.. సీతారాములకు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.. కాగా, కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా ఆంక్షలు నేపథ్యంలో సీతారాముల కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లేకుండా పోయింది.. కానీ, ఇప్పుడు పరిస్థితి అదుపులో ఉండడంతో.. ఈ ఏడాది భక్తుల సమక్షంలో రాములోరి కళ్యాణోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది టీటీడీ.. ఇవాళ…