కడప జిల్లాలో ఖాళీగా ఉన్న జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికల నిర్వహణకు అధికారులు రంగం సిద్ధం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఖాళీగా ఉన్న పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు అధికారులు..
ఒంటిమిట్టలో సీతారాముల కల్యా ణోత్సవం సందర్భంగా నేటి ఉదయం 9 గంటల నుంచి రేపు ఉదయం 10 గంటల వరకు కడప మీదుగా వెళ్లే వాహనాలను అధికారులు దారి మళ్లించారు. కడప నుంచి తిరుపతి వైపు వెళ్లే వాహనాలు అలంఖాన్ పల్లె సమీపంలోని ఇర్కాన్, ఊటుకూరు కూడళ్ల మీదుగా రాయచోటికి వెళ్లి అక్కడ నుంచి తిరుపతికి వెళ్లాల్సి ఉంటుంది. తిరుపతి నుంచి కడప వైపు వచ్చే వాహనాలు రాయచోటి మీదుగా రావాల్సి ఉంటుంది. రాజంపేట వైపు నుంచి…
ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి కల్యాణోత్సవం ఈరోజు అంగరంగ వైభవంగా జరగనుంది. శుక్రవారం సాయంత్రం 6:30 నుంచి 8:30 మధ్య పండు వెన్నెలలో రాముల వారి కళ్యాణం వైభవంగా జరగనుంది. సీతారాముల కల్యాణోత్సవానికి వైఎస్సార్ జిల్లా యంత్రాగం, టీటీడీ కలిసి సర్వం సిద్ధం చేశాయి. భక్తులకు పంపిణీ చేయడానికి లక్ష ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లను టీటీడీ సిద్ధం చేసింది. సీతారాముల కల్యాణాన్ని లక్ష మంది ప్రత్యక్షంగా వీక్షించేలా ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేశ్, బ్రాహ్మణి…
రేపు ఒంటిమిట్ట కోదండ రాముని కళ్యాణోత్సవం జరగనుంది.. సాయంత్రం 6:30 నుంచి రాత్రి 9:30 మధ్య పండు వెన్నెలలో పౌర్ణమి రోజున రాముల వారి కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు.. సీతారాముల కల్యాణోత్సవానికి సర్వం సిద్ధం చేసింది టీటీడీ.. భక్తులకు పంపిణీ చేయడానికి లక్ష ముత్యాల తలంబ్రాలు ప్యాకెట్లు సిద్ధం చేశారు..
Vontimitta: కపడ జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముని బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. రెండవ అయోధ్యగా పేరుగాంచింది. ఒంటిమిట్ట కోదండ రామాలయంలో నేటి నుంచి 14వ తేదీ వరకు బ్రహ్మోత్సవాల నిర్వహణకు టీటీడీ అధికారులు సర్వం సిద్ధం చేశారు.
పున్నమి వెలుగుల్లో ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణానికి సర్వం సిద్ధం అవుతోంది.. ఈ రోజు సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8:30 వరకు పౌర్ణమి రోజున పండు వెన్నెల్లో రాములోరి కల్యాణోత్సవం జరగనుంది.. ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయంలో నవమి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతుండగా.. అందులో భాగంగా ఛైత్ర పౌర్ణమి రోజు రాత్రి స్వామివారికి కళ్యాణం జరిపించడం ఒంటిమిట్ట ఆనవాయితీగా వస్తుంది.. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగే కళ్యాణం కోసం ఒంటిమిట్ట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం మోహిని అలంకారంలో కోదండ రాముడు భక్తులకు దర్శనమిచ్చారు.
రెండో అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయం బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నేటి నుంచి ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి ఈనెల 25 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.