ఎండలు బాబోయ్.. ఎండలు అనే పరిస్థితి రానే వచ్చింది. భానుడు భగభగమని మండిపోతున్నాడు. కొన్ని రోజుల క్రితం వరకు కూల్ కూల్ గా ఉన్న వాతావరణం నెమ్మదిగా వేడెక్కుతోంది. వేసవి వేళ ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లకు పని చెప్పాల్సిన రోజులు వచ్చేశాయ్. వేసవికి ముందే ఎయిర్ కండిషనర్లను కొనుగోలు చేస్తే ఎండతాపం నుంచి ఉపశమనం పొందొచ్చు. ఇదే సమయంలో ఈకామర్స్ సంస్థ అమెజాన్ లో ఏసీలపై ఆఫర్లు ప్రకటించింది. బ్రాండెడ్ కంపెనీకి చెందిన ఏసీలను బడ్జెట్ ధరల్లోనే…
Voltas: ప్రముఖ వ్యాపార సంస్థ, ఉప్పు నుంచి విమానాల దాకా వ్యాపారం చేస్తున్న టాటా గ్రూప్ తన గృహోపకరణాల వ్యాపారాన్ని విక్రయిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. టాటా గ్రూప్ వోల్టాస్ హోమ్ అప్లియెన్సెస్ వ్యాపారాన్ని విక్రయించాలనుకుంటున్నట్లుగా బ్లూమ్‌బర్గ్ నివేదించింది. టాటా గ్రూపుకు వోల్టాస్‌లో 30 శాతం వాటా ఉంది. వోల్టాస్ పేరిట ఏసీలు, ఫ్రిడ్జ్‌ల వంటి హోం అప్లియెన్సెస్‌ని టాటా తయారు చేస్తోంది.
Tata: దేశీయ పారిశ్రామిక దిగ్గజం టాటా ఇటీవల తన కంపెనీలోని వివిధ సంస్థల సీఈవోల జీతాలను 16-62 శాతం పెంచింది. సాధారణ టీసీఎస్ ఉద్యోగి ఏడాదికి లక్షల్లో వేతనం తీసుకుంటాడు.