ఉక్రెయిన్‌లో పారిశ్రామిక ప్రాంతమైన డాన్‌బాస్‌ను పూర్తిగా ఆక్రమించుకోవాలనే లక్ష్యానికి రష్యా దాదాపుగా చేరువైంది. అక్కడ కీలక నగరమైన సీవీరోదొనెట్స్క్‌లో ఓ రసాయన కర్మాగారంపై రష్యన్ బలగాలు భీకర దాడులు జరిపాయి. అక్కడ ఉన్న అజోట్ రసాయన కర్మాగారంపై రష్యా భారీగా ఫిరంగి గుళ్ల వర్షం కురిపించాయి. దీంతో పెద్ద ఎత్తున చమురు లీకై మంటలు ఎగిసిపడ్డాయి. ఈ కర్మాగారంలో వందల మంది ప్రజలు తలదాచుకున్నట్లు ఉక్రెయిన్ టీవీ పేర్కొంది. బాంబుల నుంచి రక్షణ కోసం ఫ్యాక్టరీ ఆవరణలోని…
రష్యాతో యుద్ధం మొదలైనప్పటి నుంచి.. అమెరికా నుంచి అత్యాధునిక ఆయుధ సాయాన్ని ఉక్రెయిన్ కోరుతోంది. అయితే, అమెరికా మొదట్లో మౌనం పాటించింది. వరుసగా నిషేధాలు విధిస్తూ.. రష్యాని దెబ్బ కొట్టే ప్రయత్నాలు చేస్తూ వస్తోందే తప్ప, ఉక్రెయిన్‌కు ఆయుధ సాయం అందించే విషయంపై మాత్రం ఎలాంటి కదిలికలు చేపట్టలేదు. ఎట్టకేలకు ఇన్నాళ్ళ తర్వాత ఆయుధ సాయం అందించేందుకు అమెరికా ముందుకొచ్చింది. స్వయంగా అధ్యక్షుడు జో బైడెన్ ఈ కీలక ప్రకటన చేశాడు. కానీ.. రష్యా భూభాగంపై ఆ…
ఉక్రెయిన్‌పై భీకర దాడులు కొనసాగిస్తోంది రష్యా.. ఇరు దేశాల మధ్య యుద్ధం పదో రోజుకు చేరుకోగా… రష్యాపై ఆంక్షలు విధించిన తర్వాత తన విశ్వరూపాన్ని చూపిస్తూ.. విరుచుకుపడుతున్నాయి పుతిన్ సేనలు.. అయితే, యుద్ధంలో ఇప్పటి వరకు 10,000 మంది రష్యా సైనికులు హతమయ్యారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం 10వ రోజులోకి ప్రవేశించిగా.. 10,000 మంది రష్యన్ సైనికులు మరణించారని పేర్కొన్నారు జెలెన్‌స్కీ… అయితే, ఉక్రెయిన్ తన సాయుధ బలగాల మరణాల గణాంకాలను…
ఉక్రెయిన్ – రష్యా మధ్య భీకర పోరు సాగుతోంది.. రష్యా బలగాలకు ఉక్రెయిన్ ఆర్మీ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతూనే ఉంది… యుద్ధంలో చనిపోయే ఉక్రెయిన్ల కంటే.. రష్యా సైనికుల సంఖ్యే భారీగా ఉంటుంది… గత 6 రోజుల్లో ఆరు వేల మంది రష్యా సైనికులను మట్టుబెట్టినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రకటించారు.. ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఏడో రోజుకు చేరుకుంది.. ఇప్పటి వరకు కనీసం 14 మంది పిల్లలతో సహా 300 మందికి పైగా పౌరులు మరణించారని…