విజయనగరం జిల్లా బొబ్బిలి గున్నతోట వలస సమీపంలో రైల్వే పట్టాలపై మృతదేహం కలకలం రేపింది. ఆ మృతదేహం బొబ్బిలి పట్టణానికి చెందిన సచివాలయ వాలంటీర్ కిలారి నాగరాజుగా గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సందడి నెలకొంది. రేపు 5 ఎమ్మెల్సీ ఎన్నికలకు జరగనున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం నుంచి ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేస్తున్నారు.
తీర ప్రాంతంలో మళ్లీ అలజడి మొదలైంది.. హుదూద్ తుఫాన్ తర్వాత ఆ స్థాయిలో రాకాసి అలలు విరుచుకుపడుతున్నాయి… విజయనగరం జిల్లా భోగాపురం మండలం, ముక్కాం సమీపంలో సముద్రంలో అల్లకల్లోలంగా మారింది.. తీరంలో ఐదు మీటర్ల ఎత్తున సముద్ర కెరటాలు ఎగసిపడుతున్నాయి.. సుమారు 150 మీటర్ల వరకు సముద్రం ముందుకు వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు.. అలల తాకిడికి తీరం వెంబడి ఉన్న రహదారులు కోతకు గురయ్యాయి.. కొన్ని చోట్ల పూర్తిగా ధ్వంస అయ్యాయి…. ఇప్పటికే సముద్రం ఒడ్డున ఉన్న…
విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండల తహసీల్దార్ కృష్ణమూర్తి ఓ మహిళా ఎస్సైపై చిందులు తొక్కారు. పనిచేతకాకపోతే గేదెలు కాచుకోవాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. పూసపాటిరేగ మండలం గోవిందపురం గ్రామస్థులు కందివలసగెడ్డలోని ఇసుకను లంకలపల్లి గుండా ప్రతిరోజూ ఎడ్లబండిలో తరలిస్తుంటారు. ఇసుక తరలింపు కారణంగా తమ గ్రామంలోని బోరుబావులు ఎండిపోతున్నాయని లంకలపల్లి గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ సోమవారం ఇసుక తరలిస్తున్న ఎడ్లబండ్లను అడ్డుకున్నారు. దీంతో వారిమధ్య వివాదం చెలరేగింది. ఈ విషయం తెలిసిన ఎస్సై…
జవాద్ తుఫాను మత్స్యకారులకు కష్టాలు మిగిల్చింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని మత్స్యకారులు ఇళ్ళకే పరిమితం అయ్యారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం చేరుకున్నాయి ఎస్ డిఆర్ఎఫ్ బృందాలు. 44మంది సిబ్బందితో తీర ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో మత్స్యకారులు సముద్రతీరంలోకి వెళ్ళడం మానేశారు. ఇటు విజయనగరం జిల్లాలో తుపాన్ ఎఫెక్ట్ తో నాలుగు రోజులు గా వేటకి వెళ్లలేదు మత్స్యకారులు. అయినా అధికారులు తమను, తమ కుటుంబాలను పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం…
ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కంటే ఎక్కువగా కరోనా ఆలోచనలు జనాల్ని వెంటాడుతున్నాయి. దీనితో మరింత అనారోగ్యపాలవుతున్నారు. మరికొందరు ఆత్మహత్యలు కేసు చేసుకుంటున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. టైఫాయిడ్ వస్తే కరోనా సోకిందని భయపడి ఓ కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. వేపాడ మండలంలోని నల్లబిల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఉడత సత్యనారాయణ గుప్తా (62) రెండు సంవత్సరాలుగా విశాఖపట్టణం జిల్లాలోని చోడవరంలో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. గుప్తాకు భార్య…