MLA Lokam Naga Madhavi: మొంథా తుఫాన్ విషయంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకున్నా.. భారీగానే నష్టం వాటిల్లింది.. అయితే, ఏ ఒక్క తుఫాన్ బాధితుడికి నష్టం జరగకుండా చూడాలని.. ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరికి సాయం అందాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశిస్తున్నా.. కింది స్థాయిలో పరిస్థితి వేరేలా ఉంది అనిపించేలా కొన్ని ఘటనలు కనపిస్తున్నాయి.. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం జనసేనా ఎమ్మెల్యే లోకం నాగమాధవికి మత్స్యకారులు చుక్కలు చూపించారు. తుఫాన్ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
TDP vs YCP: విజయనగరం జిల్లాలోని గుర్ల మండలం జమ్ము గ్రామంలో దేవి విగ్రహ నిమజ్జన కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. వైసీపీ, టీడీపీ వర్గాలు గ్రామంలో వేర్వేరుగా అమ్మవారి విగ్రహాలు ఏర్పాటు చేశారు. నవరాత్రులు ముగియడంతో ఇరు పార్టీలు నిమర్జన కార్యక్రమాన్ని చేపట్టాయి.. టీడీపీ వర్గీయులు ముందుగా అమ్మవారి విగ్రహాన్ని ఊరు దాటించారు. అయితే, వెనుక వస్తున్న వైసీపీ వర్గీయుల విగ్రహాన్ని చూసి రిథిగి ఓ వీధిలోకి మళ్లించారు. రెండు విగ్రహాలు ఎదురెదురు కావడంతో కాస్త…
విజయనగరం జిల్లాలో మెంటాడ మండలం కుంటినవలస జెడ్పీ హై స్కూల్ హెడ్ మాస్టర్ ముగడ రామకృష్ణారావు, అదే పాఠశాలలో పని చేస్తున్న ఇంగ్లీషు ఉపాధ్యాయుడిని కొట్టిన ఘటన కలకలం రేపుతోంది. రామకృష్ణారావు మద్యం సేవించి తరచూ పాఠశాలకు రావడం.. పాఠశాల ప్రతిష్టకు భంగం కలిగిస్తోందని విద్యా కమిటీ చైర్మన్ పెదిరెడ్ల సత్యనారాయణ డిప్యూటీ డీఈవో మోహనరావుకు ఫిర్యాదు చేశారు.
విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీని నడిపించే నాయకుడెవరు ? అధ్యక్షుడి స్థానాన్ని దక్కించుకునేది ఎవరు ? అందరినీ మెప్పించే, నడిపించే సారథిగా ఎవరికి అవకాశం దక్కుతుంది ? కుర్చీని నవతరం అందిపుచ్చుకుంటుందా? పాత సీనియర్లె సారథ్యం వహిస్తారా? ఇప్పుడు ఈ ప్రశ్నలే అక్కడ వినిపిస్తున్నాయి. ఇంతకీలో పోటీలో ఉన్న నాయకులు ఎవరు ?
విజయనగరం జిల్లా రేగిడి మండలం కోడిశ గ్రామానికి చెందిన ఏడు సంవత్సరాల బాలుడు పూర్ణ తేజేశ్వరరావు ఇంటి దగ్గర ఆడుకుంటూ 5 రూపాయల నాణెం మింగేసాడు. అది గొంతులో ఇరుక్కుపోవడంతో విలవిల్లాడాడు. తీవ్రంగా ఏడుస్తూ బాలుడు అస్వస్థతకు గురవ్వటంతో.. తల్లిదండ్రులు హుటాహుటిన రాజాం పట్టణంలోని ఆరోగ్య హాస్పిటల్‌కి తరలించారు.
ఏళ్ల తరబడి పేరుకుపోయిన భూ సమస్యలకు సత్వరమే పరిష్కారం చూపేందుకు సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. అందులో భాగంగా ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు ప్రారంభం అయ్యాయి.. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్లాంలో రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్... ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా గ్రామాల్లో పరిష్కారం కాని భూ సమస్యలను.. సత్వరమే పరిష్కరించేందుకు వీలుగా గ్రామాల్లో ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ప్రగతి పథంలో పరుగులిడుతూ స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దటం అందరి తక్షణ కర్తవ్యమని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. నైపుణ్యతతో కూడిన మానవ వనరుల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుని తద్వారా వచ్చే ఆర్థిక ప్రగతితో స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సాకారం చేసుకోడానికి ప్రజలు తరచుగా అనారోగ్యం పాలు కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ, ప్రయివేట్ వైద్య సిబ్బంది, ఆసుపత్రులపై ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
విజయనగరం జిల్లా గుర్లలో తీవ్రస్థాయిలో డయేరియా వ్యాధి ప్రబలటానికి (Acute Diarrheal Disease-ADD) దారితీసిన కారణాలు, భవిష్యత్తులో అట్టి పరిస్థితిని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆరుగురు సభ్యులతో కూడిన నిపుణుల బృందం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్యా మంత్రిత్వ శాఖకు సమగ్ర నివేదికను అందజేసింది. ఇద్దరు జనరల్ మెడిసిన్ వైద్యులు, కమ్యూనిటీ మెడిసిన్, మైక్రోబయాలజీ, పీడియాట్రిక్స్ నిపుణులు, సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్‌లతో కూడిన ర్యాపిడ్ రెస్పాన్స్ టీం మంగళవారం సాయంత్రం మంత్రిత్వ శాఖకు నివేదికను అందచేసింది.
విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గుర్లలో అతిసారంతో 8 మంది చనిపోయిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం గ్రామంలో ఉన్న పరిస్థితిని, బాధిత ప్రజలకు అందుతున్న వైద్య సాయాన్ని అధికారుల ద్వారా తెలుసుకున్నారు.
ఏపీలో ఇటీవల భర్తలు, భార్యల హత్యలు కలకలం రేపుతున్నాయి. ప్రతి నిత్యం ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి వార్త వినాల్సి వస్తోంది. అయితే భార్యను చంపిన భర్త అని లేదా భర్తను చంపిన భార్య అని.. తాజాగా మరో ఘటన సంచలనంగా మారింది. ఓ భార్య తన భర్తను కడతేర్చింది.