విశాఖ ఎయిర్‌పోర్ట్ ఘటన ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో రచ్చగా మారుతోంది.. ఈ ఘటనతో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తోంది అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. విశాఖపట్నం విమానాశ్రయంలో మంత్రులపై దాడిని ఖండించిన డిప్యూటీ సీఎం రాజన్నదొర… పవన్‌పై విరుచుకుపడడ్డారు.. నేను వ్యక్తిగతంగా పవన్ కల్యాణ్ అభిమానిని.. కానీ, విశాఖ ఘటనతో అయన మీద ఉన్న అభిమానాన్ని పోగొట్టుకున్నాడని వ్యాఖ్యానించారు. పవన్ తన కార్యకర్తలని క్రమశిక్షణలో పెట్టుకోలేపోతున్నారన్న ఆయన.. జన సైనికులలో క్రమశిక్షణ లేక పోవడం…
విశాఖ ఎయిర్‌పోర్ట్ దగ్గర చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి.. విశాఖ గర్జన, పవన్ కల్యాన్ విశాఖ టూర్ సందర్భంగా.. విశాఖ ఎయిర్‌పోర్ట్ దగ్గర మంత్రుల కాన్వాయ్‌లపై దాడులు జరిగాయని ఆరోపిస్తోంది వైసీపీ.. దీనికి జనసేన అధినేత పవన్ కల్యాణే సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు మంత్రి విడదల రజని.. విశాఖ నుంచి గుంటూరు చేరుకున్న మంత్రి.. ఈ సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు.. విశాఖలో మంత్రులందరి కార్లపై దాడులు చేయటం దారుణమైన…
విశాఖ ఎయిర్‌పోర్ట్ ఘటనపై అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు.. అసలు, మంత్రుల కాన్వాయ్‌పై దాడికి జనసేన అధినేత పవన్ కల్యాణే కారణం అంటున్నారు.. ఈ ఘటనపై స్పందించిన మంత్రి ఆదిమూలపు సురేష్.. మంత్రులు రోజా, జోగి రమేష్ , టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి పై జరిగిన దాడిని ఖండించారు.. ప్రజాస్వామ్యంలో దాడులు మంచివి కావని హితవుపలికిన ఆయన.. టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి సౌమ్యుడు… ఆయన పై దాడి హేయమైన చర్య అన్నారు. పవన్…
ఓ వైపు విశాఖ గర్జన.. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన.. దీంతో, విశాఖ ఎయిర్‌పోర్ట్ దగ్గర కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. మంత్రి జోగి రమేష్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రయాణిస్తున్న వాహన శ్రేణిపై జనసేన శ్రేణులు దాడి చేసినట్టు వైసీపీ ఆరోపిస్తోంది.. అయితే, దీనిపై స్పందించిన జనసేన నేత నాదెండ్ల మనోహర్.. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో మంత్రుల మీద జనసేన పార్టీ కార్యకర్తలు దాడి చేశారని రాష్ట్ర మంత్రులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు..…
విశాఖ ఎయిర్‌పోర్ట్ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి అమర్నాథ్.. విశాఖ గర్జనకు మద్దతుగా వచ్చిన మంత్రులు, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలపై దాడి చేశారని మండిపడ్డారు. గర్జన సభకు ఉత్తరాంధ్ర ప్రజల మద్దతు లభించింది.. కానీ, జేఏసీ విశాఖ గర్జనకు పిలుపిచ్చిన రోజునే.. పవన్ ఎందుకు విశాఖ పర్యటన పెట్టుకోవాల్సి వచ్చింది? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. వారు జన సైనికులా..? జన సైకోలా..? అంటూ తీవ్రంగా స్పందించారు.. జనసైకోలుగానే జనసేన కార్యకర్తలు ప్రవర్తించారన్న ఆయన..…
ఓ వైపు విశాఖ గర్జన.. మరోవైపు జనసేనాని పవన్ కల్యాణ్ పర్యటన.. విశాఖపట్నంలో ఉద్రిక్తతలకు దారి తీసింది.. విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు పవన్ కల్యాణ్ చేరుకున్న సమయంలో.. గర్జనను ముగించుకుని ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు మంత్రి జోగి రమేష్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. అయితే, వారి కాన్వాయ్‌పై రాళ్లతో, కర్రలతో దాడి చేసినట్టు వైసీపీ ఆరోపిస్తుంది.. ఈ దాడిలో.. ఇద్దరు వైసీపీ కార్యకర్తలకు గాయాలు కాగా.. కారు అద్దాలు ధ్వంసమైనట్టు చెబుతున్నారు.. అయితే, ఈ దాడిపై స్పందించిన బీజేపీ…