మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో-ఫాంటసీ చిత్రం విశ్వంభర షూటింగ్ దాదాపు పూర్తయినట్లు తాజా సమాచారం. ఈ సినిమా షూటింగ్‌లో ఒక ఐటెం సాంగ్ మినహా మిగతా అన్ని భాగాలు పూర్తయ్యాయని అంటున్నారు. వచ్చే నెలలో ఈ ఐటెం సాంగ్‌ను చిత్రీకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తుండగా, బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. విశ్వంభరలో చిరంజీవి సరసన త్రిష కృష్ణన్, ఆషిక రంగనాథ్ నటిస్తున్నారు.…