మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో-ఫాంటసీ చిత్రం విశ్వంభర షూటింగ్ దాదాపు పూర్తయినట్లు తాజా సమాచారం. ఈ సినిమా షూటింగ్‌లో ఒక ఐటెం సాంగ్ మినహా మిగతా అన్ని భాగాలు పూర్తయ్యాయని అంటున్నారు. వచ్చే నెలలో ఈ ఐటెం సాంగ్‌ను చిత్రీకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తుండగా, బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. విశ్వంభరలో చిరంజీవి సరసన త్రిష కృష్ణన్, ఆషిక రంగనాథ్ నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్‌తో భారీ స్థాయిలో రూపొందుతోంది.
Sapthagiri: నా పక్కన హీరోయిన్ గా నటించం అని చాలామంది రిజెక్ట్ చేశారు!
ఇప్పటికే హైదరాబాద్‌లోని శంకర్‌పల్లిలో నిర్మించిన భారీ సెట్‌లో చిరంజీవి ఇంట్రడక్షన్ సాంగ్‌ను చిత్రీకరించారు. ఈ పాటకి శోభి మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ సినిమా మొదట సంక్రాంతి 2025కి విడుదల కావాల్సి ఉండగా, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కోసం వాయిదా పడింది. ఇప్పుడు జూన్ చివరి వారంలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఇక సినిమాలో ఓ ఐటెం సాంగ్ కోసం శ్రీముఖి ఎంపికైనట్లు పుకార్లు వినిపిస్తున్నాయి, అయితే ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. చిరంజీవి అభిమానులు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విశ్వంభర రిలీజ్‌తో చిరంజీవి మరోసారి బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నారని భావిస్తున్నారు.