కర్ణాటకలో మొదలైన హిజాబ్ వ్యవహారం నిదానంగా దేశ వ్యాప్తంగా విస్తరించబోతోంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందు చూపుతో నిరసనకారులను కట్టడి చేస్తుంటే, మరికొన్ని రాష్ట్రాలలో ఆ వివాదాలను అడ్డం పెట్టుకుని తమ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ వివాదం ఇంకా సద్దుమణగక ముందే ఇవాళ విడుదలైన విష్ణు విశాల్ ‘ఎఫ్.ఐ.ఆర్.’ మూవీతో మరో వివాదానికి తెర లేపినట్టు అయ్యింది. ఇందులో హీరో ముస్లిం, అలానే ప్రతినాయకుడు ముస్లిం టెర్రరిస్ట్. దేశంలో అరాచకం సృష్టించడం కోసం టెర్రరిస్టు ప్రయత్నం…
విష్ణు విశాల్ కథానాయకుడిగా నటించిన ‘ఎఫ్.ఐ.ఆర్.’ సినిమా ఈ రోజు (ఫిబ్రవరి 11న) విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. అయితే కొందరు సినిమాపై వ్యక్తం చేస్తున్న వ్యతిరేకత భావాలను చిత్ర యూనిట్ ఖండించింది. ”మా ‘ఎఫ్.ఐ.ఆర్.’ ఏ మతస్థులను కించపరిచేట్లు తీయలేదు. ప్రతి భారతీయుడు గర్వపడేలా తీసిన సినిమా ఇది. కానీ, ముస్లిం మనోభావాలను దెబ్బతినేలా వుందని కొన్ని ప్రాంతాల్లో థియేటర్లలో సినిమాను ఆపేయడం జరిగింది. కానీ సినిమాను చూసిన ప్రముఖులు కానీ, ప్రేక్షకులు కానీ ముస్లిం…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్ లో మొక్కలు నాటారు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తాజ్వాల,సినీనటుడు విష్ణు విశాల్ దంపతులు. ఈ సందర్భంగా విష్ణు విశాల్,గుత్తా జ్వాల మాట్లాడుతూ పర్యవరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరారు. గ్రీన్ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చేపట్టి ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేస్తున్న ఎంపీ సంతోష్ కుమార్ కి అభినందనలు తెలియజేశారు.ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటే…
కోలీవుడ్ హీరో విష్ణు విశాల్, మంజిమ మోహన్ జంటగా మను ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్ ఐ ఆర్’. మాస్ మహారాజా రవితేజ సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ విష్ణు విశాల్ బ్యానర్ పై హీరో విష్ణు విశాల్ తెలుగులో అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని న్యాచురల్ స్టార్ నాని రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. ” ఐఎస్…
మాస్ మహరాజా రవితేజ ‘ఖిలాడి’ సినిమా ఫిబ్రవరి 11న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. అదే తేదీన విష్ణు విశాల్ ‘ఎఫ్.ఐ.ఆర్.’ మూవీ సైతం రిలీజ్ అవుతోంది. చిత్రం ఏమంటే… ‘ఎఫ్.ఐ.ఆర్.’ మూవీకి రవితేజ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. విష్ణు విశాల్ తమిళంలో ‘భీమిలి కబడ్డి జట్టు, రాక్షసుడు’ చిత్రాలలో నటించాడు. అవి రెండూ తెలుగులో రీమేక్ అయ్యి చక్కని విజయం సాధించాయి. అలానే ఇటీవల వచ్చిన రానా ‘అరణ్య’లోనూ విష్ణు విశాల్ కీలక పాత్ర పోషించాడు. అతని…
సినిమా ఇండస్ట్రీలో రీసెంట్ గా చాలామంది ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు, త్రిష, వరలక్ష్మీ శరత్ కుమార్ వంటి వారికి కోవిడ్-19గా నిర్ధారణ కాగా, తాజాగా మరో నటుడు తనకు కరోనా సోకినట్టు నిర్ధారించారు. తమిళ నటుడు, నిర్మాత విష్ణు విశాల్ తనకు కోవిడ్‌కు పాజిటివ్ వచ్చినట్లు ప్రకటించారు. ఆదివారం ట్విట్టర్‌లో విష్ణు విశాల్ ‘పాజిటివ్ రిజల్ట్ తో 2022 ప్రారంభించినట్లు చెప్పారు. “అబ్బాయిలో… అవును నాకు కోవిడ్ పాజిటివ్ రిజల్ట్ వచ్చింది.…
మాస్ మహారాజ రవితేజ, త్రినాధరావు నక్కిన కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ధమాకా. పెళ్లి సందడి ఫేమ్ శ్రీ లీల ఈ సినిమాలో రవితేజ సరసన నటిస్తోంది. ఇక ఇప్పటికే పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది. ఈ సినిమాలో మరో యంగ్ హీరో కి కూడా చోటు ఉన్నదని, ఆ హీరో గా రాజ్ తరుణ్ ని ఎంపిక చేసినట్లు వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. సినిమాలో ఆ పాత్ర చాలా…
ప్రముఖ బాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలా, తమిళ నటుడు విష్ణు విశాల్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గత ఏడాది సెప్టెంబర్ లో నిశ్చితార్థం చేసుకున్న వీరిద్దరూ ఈ రోజు అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య పెళ్లితో ఒక్కటయ్యారు. గతరెండ్రోజుల నుంచి గుత్తా జ్వాలా, విష్ణు విశాల్ పెళ్లి సంబరాలు ప్రారంభం కాగా… వీరి పెళ్ళికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా పెళ్లి బట్టల్లో వధూవరులుగా మెరిసిపోతున్న గుత్తా జ్వాలా, విష్ణు విశాల్ పిక్…
ఈ ఏడాది మరో ప్రముఖ జంట పెళ్లి బంధంలోకి అడుగు పెట్టడానికి రెడీ అయిపోయింది. ప్రముఖ బాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలా తన ప్రియుడు విష్ణు విశాల్ తో పెళ్ళికి రెడీ అయ్యింది. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా పెళ్లి తేదీని ప్రకటించేసింది. ఏప్రిల్ 22 న గుత్తా జ్వాలా, విష్ణు విశాల్ పెళ్లి చేసుకోబోతున్నారు. వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నారు. మూడేళ్ల క్రితం తమ సంబంధాన్ని ప్రకటించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో జ్వాలా…