ఆన్లైన్ పుణ్యమా అని.. ఎవరు అసలు.. ఎవరు నకిలీ అనే గుర్తించడమే కష్టంగా మారిపోయింది… ఆశ చూపుతూ అన్నీ దోచేస్తున్నారు.. అసలు విషయం తెలిసేలోపు.. అందినకాడికి దోచేస్తున్నారు.. తాజాగా, విశాఖ, మాట్రిమోనీ ముసుగులో మస్కా కొట్టిన ఘటన వెలుగుచూసింది.. రెండో వివాహం కోసం ప్రొఫైల్ పెట్టిన మహిళలే టార్గెట్గా.. వెబ్ సైట్లో పెట్టిన వివరాల ఆధారంగా మోసాలకు పాల్పడుతున్నారు నైజిరియన్లు.. విదేశాల్లో ఉన్నత స్థానంలో ఉన్నట్టు చెబుతూ పరిచయం చేసుకుంటున్న కేటుగాళ్లు.. విలువైన బహుమతులు పంపుతున్నామంటూ వల…
పసిడి ప్రేమికులకు శుభవార్త చెబుతూ.. మరోసారి బంగారం ధరలు కాస్త కిందికి దిగాయి.. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 తగ్గి రూ.47,000కి దిగిరాగా.. 24 క్యారెట్ల10 గ్రాముల పసిడి రూ.270 తగ్గడంతో రూ.51,270కి పరిమితమైంది.. హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలో ఈ రోజు బంగారం ధరలను ఓసారి పరిశీలిస్తే.. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 తగ్గి.. రూ. 47,000కి చేరింది.. 24 క్యారెట్ల 10…
సీఎం జగన్మోహన్ రెడ్డి రేపు విశాఖలో పర్యటించనున్నారు.. ఫిషింగ్ హార్బర్ నుంచి భీమిలి బీచ్ వరకు 25వేల మందితో 25 కిలోమీటర్ల మెగా క్లీనప్ డ్రై వ్ లో పాల్గోనున్నారు. నగరానికి మణిహారమైన సముద్రంలో పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్ధాలు తొలగింపును యజ్ఞంగా చేపట్టింది విశాఖ జిల్లా అధికార యంత్రాంగం.. 25వేల మంది భాగస్వామ్యంతో… 25కిలోమీటర్ల పొడవున మెగా బీచ్ క్లీనప్ డ్రైవ్ కు శ్రీకారం చుట్టింది. ఈ ప్రయత్నం గిన్నీస్ రికార్డ్ నెలకోల్పో దిశగా జరుగుతోంది. ఫిషింగ్…
విశాఖ గురించి ఏ మాత్రం పరిచయం ఉన్న వాళ్ళకైనా ఇక్కడ నీలి సముద్రం అందాలు సుపరి చితం. 35కిలోమీటర్ల తీరంలో బంగారపు రంగులో మెరిసిపోయే ఇసుక తిన్నెలు.. వాటిని బలంగా తాకే అలలు కనిపిస్తాయి. కానీ, రెండు రోజులుగా ఇక్కడ సముద్రం కొంత మేర రంగు మారింది. నల్లటి ఇసుక మేటలు వేస్తోంది. కోస్టల్ బ్యాటరీ నుంచి వుడా పార్క్ మధ్య తీరం నల్లగా మారడం తో సందర్శకులు అందోళనకు గురైయ్యారు.. నల్లటి ఇసుక కొట్టుకుని రావడం…
విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ వద్ద మాయమైనప్పటి నుంచి సాయిప్రియ ఒకదానికి మించి మరొక ట్విస్టులు ఇస్తూనే ఉంది. సముద్రంలో గల్లంతయ్యిందనుకుంటే.. బెంగుళూరులో ప్రియుడు రవితో ప్రత్యక్షమైంది. ఇంతలోనే అతనితో తనకు వివాహమైందంటూ షాకిచ్చింది. తనని వెతకొద్దని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. అయితే.. సాయిప్రియ ఆడిన డ్రామాపై కోస్ట్ గార్డ్ సీరియస్ అయింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలంటూ వైజాగ్ పోలీస్ కమిషనర్ తో పాటు జీవీఎంసీ కమిషనర్ కు మెయిల్ చేసింది. తప్పుడు సమాచారంతో అత్యంత…