కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) తాజాగా దేశంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితాను విడుదల చేసింది… ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల్లోని నాలుగు సిటీలకు చోటు దక్కింది.. ముఖ్యంగా ఉమ్మడి ఏపీ రాజధాని, ప్రస్తుత తెలంగాణ రాజధాని హైదరాబాద్‌తో పాటు.. ఏపీలో కేపిటల్ సిటీగా చెబుతున్న విశాఖపట్నం కూడా ఉన్నాయి.. సీపీబీటీ తాజా నివేదిక ప్రకారం.. విశాఖపట్టణంలో గాలి నాణ్యత తక్కువగా అంటే 202 పాయింట్లుగా ఉండగా.. అనంతపురంలో 145 పాయింట్లు.. హైదరాబాద్‌లో 100 పాయింట్లు, తిరుపతిలో 95 పాయింట్లు, ఏలూరులో 61 పాయింట్లుగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది..
Read Also: Nitin Gadkari: దేశం ఆయనకు రుణపడి ఉంది.. మన్మోహన్ సింగ్‌పై నితిన్ గడ్కరీ ప్రశంసల జల్లు
ఇక, సీపీసీబీ మంగళవారం విడుదల చేసిన అత్యంత కాలుష్య నగరాల జాబితాలో బీహార్‌లోని కతిహర్ టాప్ స్పాట్‌లో నిలిచింది.. కతిహర్‌లో గాలి నాణ్యత (ఏక్యూఐ) 360 పాయింట్లకు పడిపోగా.. ఢిల్లీ (354 పాయింట్లు), నోయిడా (328), ఘజియాబాద్ (304) నగరాలు వరుసగా ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి.. బిహార్‌లోని బెగుసరాయ్, హరియాణాలోని బల్లాబ్‌గఢ్, ఫరిదాబాద్, కైతాల్, గురుగ్రామ్, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లను కూడా కాలుష్య నగరాలుగా పేర్కొంది సీపీసీబీ.. మొత్తంగా భారతదేశంలో వాయు కాలుష్య స్థాయిలు 2022లో మరింత దిగజారింది.. ఈ డేటా భారతదేశానికి మేల్కొలుపుగా చెబుతారు.. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఏఆర్‌ఐ) పంజాబ్‌లో బుధవారం నాడు 3,634 పొలాల్లో మంటలు చెలరేగినట్లు నివేదించింది, ఇది ఈ సంవత్సరం ఇప్పటివరకు అత్యధికంగా పేర్కొంది..
మరోవైపు, వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ఉత్తరప్రదేశ్ మరియు హర్యానా ముఖ్యమంత్రులకు రాజధాని సరిహద్దుల్లో ట్రాఫిక్ జామ్‌లను నివారించడానికి పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వేలపై అనవసరమైన వస్తువులను రవాణా చేసే ట్రక్కులను మళ్లించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ అండ్ సైన్సెస్ పరిధిలోని సఫర్ అనే అంచనా ఏజెన్సీ ప్రకారం, రవాణా స్థాయి గాలులు అననుకూలమైన కారణంగా ఢిల్లీలోని పీఎం2.5 కాలుష్యం శుక్రవారం 30 శాతం నుండి శనివారం 21 శాతానికి పడిపోయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లేదా AQI PM 2.5 స్థాయిల సాంద్రతను కొలుస్తుంది.. 2.5 మైక్రాన్ల కంటే తక్కువ ఉండే సూక్ష్మ కణాలు రక్తప్రవాహంలోకి ప్రవేశించి ఊపిరితిత్తులు మరియు గుండెలోకి చొచ్చుకుపోతాయి.. ఇవి దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తుందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.