కోటి విద్యలు కూటి కొరకు అన్నారు పెద్దలు. మనిషి బతకడానికి కోటి విద్యలు ఉన్నాయంట. అయితే ఎలా పడితే అలా బతికితే కుదరదు. సమాజంలో కొన్ని రూల్స్.. కొన్ని పద్ధతులు ఉన్నాయి.
విశాఖ నగర నడిబొడ్డున భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠా కలకలం రేపింది. గత కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా జోరుగా ఈ క్రికెట్ బెట్టింగ్ ఆన్లైన్, ఆఫ్లైన్లలో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 176 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు బెట్టింగ్ కేటుగాళ్లు.
మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ కేసులో విశాఖపట్నం కోర్టు తీర్పు వెలువరించింది.. ఈ కేసులో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్.. ఫన్ బకెట్ భార్గవ్ కు ఫోక్సో చట్టం కింద 20 ఏళ్ల కఠిన కారాగారా శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది కోర్టు.. అంతేకాదు.. ఈ కేసులో బాధితురాలికి 4 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది కోర్టు..
దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణీకుల రద్దీని క్లియర్ చేయడానికి చర్లపల్లి- విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు నడపనుంది. రేపటి నుంచి సికింద్రాబాద్ విశాఖ వందేభారత్ ఎక్స్ప్రెస్ లో కూడా కోచ్లు పెంచనున్నారు. ఇకపై రైళ్లో 3 ఎగ్జిక్యూటివ్ కోచ్లు, 17 చైర్ కార్లు ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్లన్నీ జనరల్ కోచ్లలో ప్రయాణించే ప్రయాణీకుల సౌకర్యార్థం ఏర్పాటు చేశారు. ఇందులో అన్రిజర్వ్డ్ కోచ్లు ఉన్నాయి. ఈ రైళ్ల పూర్తి…
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు రోడ్డెక్కారు. కూర్మన్నపాలెం గేట్ దగ్గర నేషనల్ హైవేపై కార్మికులు బైఠాయించారు. దీంతో పోలీసులు-కార్మికుల మధ్య తోపులాట చోటుచేసుకుంది.
Narendra Modi Vizag Tour Live Updates : ప్రధాని మోడీ విశాఖపట్నం పర్యటనకు వస్తున్నారు. ఆయనను ఎయిర్పోర్టులో గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతించారు. సాయంత్రం 4:45 గంటలకు ప్రధాని రోడ్ షో ప్రారంభం కానుంది. సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ వరకు ఈ రోడ్ షో జరగనుంది. ఇందులో చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు పాల్గొననున్నారు. సాయంత్రం 5:30 గంటలకు ఏయూ…
ప్రధాని నరేంద్రమోడీ పర్యటనలో పలు కీలక ప్రాజెక్టులు పట్టాలెక్కబోతున్నాయి. విశాఖ స్టీల్ప్లాంట్పై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఉత్తరాంధ్ర వాసులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న రైల్వేజోన్ ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు ప్రధాని. అనకాపల్లి జిల్లా పూడిమడక దగ్గర NTPC గ్రీన్ హైడ్రోజన్ హబ్ పనులను ప్రారంభిస్తారు.