క్రీడాప్రపంచంలో కింగ్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ ప్రస్థానం ముగిసింది. కేవలం 36 ఏళ్ళ వయసులో కోహ్లీ తన రిటైర్మెంట్ ని ప్రకటించాడు. ఇప్పటికే రోహిత్ తప్పుకోగా.. త్వరలో మరో కీలక ఆటగాడు కూడా టెస్టుల నుంచి వైదొలగనున్నాడు. ఇలా వరుసగా ఒక్కొక్కరు తప్పుకుంటుండగా అది ఫ్యాన్స్ కు మింగుడుపడటం లేదు. కానీ వాళ్ళ వ్యక్తిగత నిర్ణయాలను మనం గౌరవించాల్సిందే. సుదీర్ఘ ఫార్మెట్లో దశాబ్దానికి పైగా ఆడి, రిటైర్మెంట్ ప్రకటించడం వెనుక వాళ్ళకీ బాధ ఉంటుంది. రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించే క్షణం ముందు ఎంతో ఆలోచించే ఉంటారు.
Also Read:Miss World 2025: చార్మినార్ వద్ద “హెరిటేజ్ వాక్”లో పాల్గొననున్న ప్రపంచ సుందరీమణులు.!
ఇక సీనియర్ ఆటగాళ్లు ఇచ్చిన షాక్ నుంచి కోలుకునే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. మనందరి ఫెవరెట్ ఆటగాళ్లు శిఖర్ ధావన్, సురేష్ రైనా త్వరలో బ్యాట్ పట్టి మైదానంలోకి అడుగుపెట్టబోతున్నారు. గ్రేటర్ నోయిడాలో మే 27 నుండి జూన్ 5 వరకు జరగనున్న ఇంటర్ కాంటినెంటల్ లెజెండ్స్ ఛాంపియన్‌షిప్ లో రైనా, ధావన్, శ్రీలంక మాజీ ఓపెనర్ దిల్షాన్ పాల్గొంటారు. ఈ టోర్నమెంట్‌లో దిల్షాన్, న్యూజిలాండ్ మాజీ బ్యాట్స్‌మన్ మార్టిన్ గుప్టిల్ , ఆఫ్ఘనిస్తాన్ మాజీ కెప్టెన్ అస్గర్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సీనియర్ ఆటగాళ్ళు పాల్గొంటారు.
Also Read:Amritsar Spurious LiquorG: కాటికి పంపిన కల్తీ మద్యం.. 14 మంది మృతి
భారత మాజీ బౌలర్లు ప్రవీణ్ కుమార్, మన్‌ప్రీత్ గోని ఇండియన్ వారియర్స్ తరపున ఆడనున్నారు. ఆరు జట్లు పాల్గొనే ఈ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్ ఆరు ఖండాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. టోర్నమెంట్‌లో ఆరు జట్లు పాల్గొంటాయి. అంతర్జాతీయ స్థాయిలో విశేషంగా ఆకట్టుకున్న ఈ సీనియర్ ఆటగాళ్లు మరోసారి బ్యాట్ పడుతుండటంతో ఫ్యాన్స్ కూడా లెజెండ్స్ ఛాంపియన్‌షిప్ పై ఆసక్తి చూపిస్తున్నారు.