భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల కుమార్తె వామిక పిక్ ఎట్టకేలకు లీక్ అయ్యింది. 2021 జనవరి 11న వామిక జన్మించగా, అప్పటి నుంచి పాప విషయంలో గోప్యతను పాటిస్తున్నారు. వామికతో కలిసి ఉన్న ఫోటోలను విరుష్క దంపతులు సోషల్ మీడియాలో షేర్ చేసినా ఆమె ముఖం మాత్రం కన్పించకుండా జాగ్రత్త పడుతున్నారు. బయట ఎక్కడైనా కనిపించినా ఫోటోగ్రాఫర్లకు కూడా ఫోటోలు వద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. “సోషల్ మీడియాకు దూరంగా తన జీవితాన్ని స్వేచ్ఛగా జీవించే అవకాశాన్ని ఆమెకు అందించడానికి మా వంతు కృషి చేయాలనుకుంటున్నాము” అంటూ విరుష్క దంపతులు ఎప్పుడో చెప్పేశారు. దీంతో ఇన్ని రోజులూ వాళ్ళ అభిమానులకు వామికను కనులారా చూసే అవకాశం దక్కలేదు.
Read Also : “అంటే సుందరానికి” షూటింగ్ పూర్తి
కానీ తాజాగా తన తండ్రితో కలిసి దక్షిణాఫ్రికాలో జరుగుతున్న టోర్నమెంట్ కోసం వచ్చిన వామిక పిక్ ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. స్టాండ్స్‌లో అనుష్క వామికను ఎత్తుకోగా, ఇద్దరూ కలిసి మ్యాచ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. లైవ్ లో వీరిద్దరినీ చూపించగా, ఓ నెటిజన్ మొదటిసారిగా వామిక ముఖాన్ని బహిర్గతం చేస్తూ స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేశారు. వామిక చాలా అందంగా కనిపించడమే కాకుండా అక్షరాలా విరాట్ జిరాక్స్ కాపీలా ఉంది. అయితే విరుష్క దంపతులు అన్నిసార్లు చెప్పినా ఈ నెటిజన్ పిక్ ను షేర్ చేయడంపై అభిమానులు ఫైర్ అవుతున్నారు. వెంటనే పిక్స్ ను డిలీట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా వామికను చూడాలన్న కోరిక అయితే తీరింది చాలామందికి. ప్రస్తుతం వామిక పిక్ వైరల్ అవుతుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు !