గత ఏడాది కరోనా కేసుల కారణంగా ఇంగ్లండ్‌లో టీమిండియా ఆడుతున్న టెస్టు సిరీస్ అర్ధంతరంగా ఆగిపోయింది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా నాలుగు టెస్టులు మాత్రమే జరిగాయి. ఐదో టెస్టు వాయిదా పడింది. ఈ టెస్టును ఈ ఏడాది నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాయిదా పడిన ఐదో టెస్టు ఆడేందుకు టీమిండియా గురువారం నాడు ఇంగ్లండ్ బయలుదేరి వెళ్లింది. సిరీస్ ఫలితాన్ని తేల్చే ఈ నిర్ణయాత్మక టెస్టు మ్యాచ్ జూలై 1 నుంచి ఎడ్జ్‌బాస్టన్‌లో జరగనుంది. అయితే…
భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ తప్పుకున్న నాటి నుంచి టీమిండియాకు ఇప్పటివరకు ఒకే ఏడాదిలో ఏడుగురు కెప్టెన్లుగా వ్యవహరించారు. ఏడాది నుంచి చూస్తే టీమిండియాకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, ఆజింక్యా రహానె, రిషబ్ పంత్, హార్డిక్ పాండ్యా కెప్టెన్లుగా వ్యవహరించిన పరిస్థితి కనిపిస్తోంది. ఒకే సమయంలో రెండు పర్యటనలకు వెళ్లడం, సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వడం, పలువురు గాయపడటం వంటి పరిస్థితుల కారణంగా ఏడుగురు కెప్టెన్లు పనిచేయాల్సి వచ్చింది. గత…
రిషబ్ పంత్ సారథ్యంలో యంగ్ టీమిండియా టీ-20 సిరీస్‌లో దక్షిణాఫ్రికాతో తలపడుతుండగానే మరోవైపు సీనియర్ ఆటగాళ్లు లండన్‌కు పయనమయ్యారు. గురువారం టీమిండియా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ, ఛతేశ్వర్ పుజారాతో పాటు పలువురు ఆటగాళ్లు లండన్ బయలుదేరి వెళ్లారు. ఇందుకు సంబంధించి ఫొటోలను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. గతేడాది ఇంగ్లాండ్ పర్యటనలో కరోనా కారణంగా వాయిదా పడ్డ ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడనుంది టీమిండియా. జులై 1న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఈ…
రాబోయే ఇంగ్లండ్ పర్యటనకు ముందు భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ విహారయాత్రను ఎంజాయ్ చేస్తున్నాడు. ఆదివారం దక్షిణాఫ్రికా బీచ్‌లో కోహ్లీ సేదతీరాడు. దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకుంటున్న విరాట్ కోహ్లీ బీచ్‌లో సెలవులను ఆనందంగా గడుపుతున్నాడు. విరాట్ తన ట్విటర్లో బీచ్‌లో కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్న ఫొటోను పోస్ట్ చేశాడు. 33 ఏళ్ల కోహ్లీ క్రికెట్ ప్రపంచానికి దూరంగా బీచ్ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఐపీఎల్ 2022 అనంతరం జరుగుతున్న దక్షిణాఫ్రికా టీ20…
సాధారణంగా ప్రతి ఒక్క ఆటగాడికీ ఒక ఫేవరేట్ క్రికెటర్ ఉంటారు. అందరూ దాదాపు బాగా పేరుగడించిన దిగ్గజాల పేర్లే చెప్తారు. కానీ, హార్దిక్ పాండ్యా మాత్రం అందుకు భిన్నంగా ఆశ్చర్యపరిచాడు. తనకు సచిన్, కోహ్లీ లాంటి డ్యాషింగ్ ప్లేయర్లు ఇష్టమేనని చెప్పిన ఈ యంగ్ సెన్సేషన్.. ఫేవరేట్ ప్లేయర్ మాత్రం వసీమ్ జాఫర్ అని చెప్పుకొచ్చాడు. ‘‘అందరికీ తమకంటూ ఫేవరెట్ క్రికెటర్లు ఉంటారు. నాకూ ఉన్నారు. జాక్వెస్ కలిస్, విరాట్ కోహ్లి, సచిన్ సర్ అంటే నాకెంతో…
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈమధ్యకాలంలో ఫామ్‌లో లేడన్న సంగతి అటుంచితే.. ఇప్పటివరకూ కెరీర్లో అతడు ఎన్నో ఘనతల్ని సాధించాడు. పాత రికార్డుల బూజు దులిపేసి, ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డులెన్నో నమోదు చేశాడు. కేవలం మైదానంలోనే కాదండోయ్, సోషల్ మీడియాలోనూ ఇతనికి తిరుగులేదు. బ్యాట్‌తో రికార్డుల ఖాతాని ఎప్పట్నుంచి తెరిచాడో, అప్పట్నుంచే కోహ్లీకి నెట్టింట్లో ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్‌లో 200 మిలియన్ మార్క్‌ని దాటేశాడు. ఈ ఘనత…
జూన్ 9వ తేదీ నుంచి భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనున్న విషయం తెలిసిందే! అయితే.. రోహిత్ శర్మ సహా విరాట్ కోహ్లీ, బుమ్రాలను విశ్రాంతి పేరిట ఈ సిరీస్‌కు ఎంపిక చేయలేదు. కొంతకాలం నుంచి తీరిక లేకుండా ఆడుతున్న ఈ సీనియర్లకు విశ్రాంతి తప్పదని చెప్పి, సెలెక్టర్లు తుది జట్టులోకి వారిని తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే భారత మాజీ పేసర్ ఆర్పీ సింగ్ స్పందిస్తూ.. రోహిత్ శర్మకు విశ్రాంతీ తీసుకోవాల్సిన…
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి రావాల్సిన అవసరం ఉందని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్, భారత దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు. టీ20 ప్రపంచకప్‌లో ఈ ఇద్దరు చెలరేగాలని, లేకుంటే వారికి ఇదే చివరి మెగా టోర్నీ అవుతుందని హెచ్చరించారు. ఇక మెగా టోర్నీ నేపథ్యంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మరింత ఒత్తిడిలో కూరుకుపోయే అవకాశం ఉందని అక్తర్ అభిప్రాయపడ్డాడు. సచిన్ టెండూల్కర్ సైతం 100వ…
IPL 2022 సీజన్ ప్రదర్శనను పరిగణలోకి తీసుకొని T20 ప్రపంచకప్ లో బరిలోకి దిగే భారత జట్టును ఎంపిక చేసాడు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా. తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఆస్ట్రేలియాలో ఈ ఏడాది చివర్లో జరిగే ప్రపంచకప్‌కు తాగాజా జరిగిన IPLప్రదర్శన ఆధారంగా 16 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసాడు. అయితే ఈ జట్టులో రోహిత్ ,కోహ్లీ కి అవకాశం దక్కలేదు. అయితే తన జట్టు ఓపెనర్లుగా KL రాహుల్, ఇషాన్…
“ఈ సాల కప్ నమ్ దే ” అనే నినాదం ప్రతీ సీజన్ వినీ వినీ విసుగొస్తుంది గాని కప్ మాత్రం కొట్టడం లేదు. దీంతో ఈ నినాదం వచ్చే సీజన్ కి పోస్టుపోన్ అవుతుంది. గత 15 ఏళ్లుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకి ఐపీఎల్ టైటిల్ అందని ద్రాక్షగానే మిగిలింది. కనీసం తాజాగా ముగిసిన సీజన్లోనైనా ఆర్సీబీ టైటిల్ కొడుతుందని భావించినా.. ఆ జట్టు ప్రయాణం రెండు అడుగుల దూరంలోనే నిలిచిపోయింది. అద్భుత ప్రదర్శనతో ప్లే…