Wasim Jaffer: కోహ్లీ.. నీకిది అవసరమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్‌లో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ, జానీ బెయిర్‌స్టో మధ్య వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే! అప్పటివరకూ ఆచితూచి ఆడిన బెయిర్‌స్టో.. కోహ్లీ స్లెడ్జింగ్ చేసిన తర్వాత చెలరేగిపోయాడు. భారీ షాట్లతో పరుగుల వర్షం కురిపించాడు. టీ20ని తలపించాడని చెప్పుకోవచ్చు. దీంతో, కోహ్లీ అతడి జోలికి వెళ్లకుండా ఉంటే బాగుండేదేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సరిగ్గా ఇదే అభిప్రాయాన్ని టీమిండియా మాజీ బ్యాట్స్మన్ వసీం జాఫర్ వ్యక్తపరిచాడు. ఉద్దేశపూర్వకంగా ఎదుటి వ్యక్తుల్ని రెచ్చగొడితే, ఒక్కోసారి మనమే చేదు అనుభవం ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నాడు.
‘‘కోహ్లీ చేసిన స్లెడ్జింగ్, బెయిర్ స్టో దూకుడుకు కారణమైందా? అంటే అవునని చెప్పడంలో సందేహం లేదు. అప్పటివరకూ బెయిర్ స్టో జాగ్రత్తగా, నెమ్మదిగా ఆడాడు. కానీ, ఆ తర్వాత ఒక్కసారిగా రెచ్చిపోయాడు. నిజానికి ఒకరిని కావాలని రెచ్చగొడితే, ఒక్కోసారి మనకే బ్యాక్‌ఫైర్ అవుతుంది. ఇక్కడ కూడా అదే జరిగినట్టు అనిపిస్తోంది. కోహ్లీ స్లెడ్జింగ్‌కు బదులిచ్చే క్రమంలో బెయిర్ స్టో రెచ్చిపోయి ఆడాడేమో’’ అంటూ వసీం వ్యాఖ్యానించాడు. కోహ్లీకి అది అవసరం లేదన్నట్టుగా చెప్పాడు. ఇదే సమయంలో భారత బౌలింగ్ విభాగంపై కూడా ప్రశంసలు కురిపించాడు. ‘‘ఇరు జట్ల బ్యాట్స్మన్లు మెరుగ్గానే రాణిస్తున్నారు. అయితే, భారత బౌలర్లు విజృంభించడం టీమిండియాకు కలిసొచ్చింది’’ అని చెప్పాడు. సిరాజ్, బుమ్రా, షమీ అద్భుతంగా బౌలింగ్ వేశారని.. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను 284 పరుగులకే కట్టడి చేవారని వసీం కితాబిచ్చాడు.
Also Read
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
కాగా.. బుమ్రా 3, షమీ 2, సిరాజ్ 4, శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్‌తో రాణించడంతో ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 284 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా భారత్ 245 పరుగులకు ఆలౌట్ అవ్వడంతో.. ఇంగ్లండ్‌కు 378 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. ప్రస్తుతం క్రీజులో ఉన్న ఇంగ్లండ్ ఓపెనర్లు దుమ్ముదులిపేస్తున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు పరుగులకే ఔటైనా అలెక్స్.. రెండో ఇన్నింగ్స్‌లో చెలరేగిపోతున్నాడు.
తాజావార్తలు
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
-
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!