Virat Kohli Reply To Babar Azam Tweet: చాలాకాలం నుంచి ఫామ్‌లేమితో సతమతమవుతున్న విరాట్ కోహ్లీపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే! ముఖ్యంగా.. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో మరోసారి నిరాశపరచడంతో, అభిమానులు సమా మాజీలు కోహ్లీని టార్గెట్ చేశారు. ఇక అతని పని అయిపోయిందని, జట్టులో నుంచి తీసేయాల్సిందేనని కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే అతనికి కొందరు మద్దతుగా నిలిచారు. అందరికంటే ముందు పాకిస్తాన్ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజమ్…
ఈమధ్య ఫామ్‌లేమితో సతమతమవుతున్న విరాట్ కోహ్లీ మీద ప్రతి మ్యాచ్‌కి ముందు భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్ & మాజీలు. ముఖ్యంగా.. లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో కోహ్లీ కచ్ఛితంగా దుమ్ములేపుతాడని, తిరిగి ఫామ్‌లోకి వస్తాడని చాలా ఆశించారు. కానీ, కోహ్లీ ఆ ఆశలపై నీళ్లూ చల్లుతూ మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. కేవలం 25 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ.. మూడు ఫోర్ల సహాయంతో 16 పరుగులే చేశాడు. విల్లే బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కి…
తొలి వన్డేలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇంగ్లండ్‌ని భారత్ చిత్తుగా ఓడించడంతో.. రెండో వన్డేలోనూ అదే జోష్ కొనసాగించి, సిరీస్ కైవసం చేసుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ, ఆ అంచనాల్ని తిప్పికొడుతూ ఇంగ్లండ్ ఘనవిజయం సాధించింది. లార్డ్స్ మైదానంలో జరిగిన రెండో వన్డేలో 100 పరుగుల తేడాతో భారీ విజయం సొంతం చేసుకుంది. దీంతో.. వన్డే సిరీస్ 1-1తో సమం అయ్యింది. ఈ నేపథ్యంలోనే తమ ఓటమికి గల కారణాల్ని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ‘‘మా బౌలర్లు బాగా…
ఇంగ్లండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ విరాట్ కోహ్లీ నిరాశపరిచడంతో.. అతని ప్రదర్శనపై అప్పుడే చర్చలు, విమర్శలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం ఓ జర్నలిస్ట్ మరోసారి కోహ్లీ ఆటతీరుపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ప్రశ్నించాడు. ‘కోహ్లీ ప్రదర్శనపై చర్చలు మళ్లీ ప్రారంభమయ్యాయి’ అని అనగానే రోహిత్ ఒక్కసారిగా కోపాద్రిక్తుడయ్యాడు. ‘ఎందుకు చర్చలు జరుగుతున్నాయ్ అయ్యా, నాకర్థం కావడం లేదు’ అంటూ బదులిచ్చాడు. ఆ తర్వాత శాంతించి.. కోహ్లీకి మద్దతుగా మాట్లాడాడు. ‘‘ఏ ఆటగాడు ఎప్పుడూ…
చాలాకాలం నుంచి విరాట్ కోహ్లీ ఫామ్‌లేమితో సతమతమవుతున్న విషయం అందరికీ తెలిసిందే! తనని తాను నిరూపించుకోవడానికి అవకాశాలు ఎన్ని వస్తోన్నా.. ఏదీ సద్వినియోగ పరచుకోవడం లేదు. ఒకప్పుడు రన్ మెషీన్‌గా ఓ వెలుగు వెలిగిన కోహ్లీ.. ఇప్పుడు కనీస పరుగులు చేసేందుకు కూడా తంటాలు పడుతున్నాడు. ఇక ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లోనూ కోహ్లీ తీవ్రంగా నిరాశపరిచాడు. 25 బంతుల్లో కేవలం 16 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఎప్పట్లాగే కీపర్‌కి క్యాచ్…
తొలి వన్డేలో అద్భుతమైన విజయం సాధించిన భారత్.. రెండో వన్డేలో మాత్రం ఘోర పరాజయం చవిచూసింది. బ్యాట్స్మన్లు పూర్తిగా చేతులెత్తేయడంతో, సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌ని చేజార్చుకుంది. ఓపెనర్లు పూర్తిగా ఫెయిల్ అవ్వడం, మిడిలార్డర్ బ్యాట్స్మన్లు కూడా రాణించకపోవడంతో.. ఏకంగా 100 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఫస్ట్ వన్డేలో బుమ్రా తరహాలో రెండో వన్డేలో ప్రత్యర్థి బౌలర్ టాప్లీ భారత్‌ని దెబ్బ తీశాడు. ఆరు వికెట్లతో కొరడా ఝుళిపించాడు. దీంతో.. ఈ వన్డే సిరీస్ 1-1 తో సమం…
మెగాస్టార్ చిరంజీవికి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా అభిమానులు ఉంటారు. టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లీకి మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టం ఉండేదని కోహ్లీ చిన్ననాటి స్నేహితుడు, తెలుగు క్రికెటర్ ద్వారక రవితేజ అన్నాడు. యూకేలో విరాట్ కోహ్లీని కలిసినట్లు రవితేజ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. సుమారు ఆరేళ్ల తర్వాత కోహ్లీ, తాను కలుసుకున్నామని.. వెంటనే విరాట్ నన్ను చిరు ఎలా ఉన్నావ్ అంటూ ఆప్యాయంగా పిలిచాడని రవితేజ వివరించాడు. అండర్-15…
లార్డ్స్ వేదికగా గురువారం రెండో వన్డేలో ఆతిథ్య ఇంగ్లండ్‌తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. తొలి వన్డేలో ఘోర పరాజయం చవిచూసిన ఇంగ్లండ్ మూడు వన్డేల సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంంటే రెండో వన్డేలో విజయం సాధించి తీరాల్సిందే. టీమిండియా మాత్రం రెండో వన్డేలో కూడా రాణించాలని కోరుకుంటోంది. గజ్జల్లో గాయంతో తొలి వన్డేకు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ రెండో వన్డేకు కూడా దూరం కానున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అతడు ఇంకా గాయం నుంచి కోలుకోలేదని…
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మద్దతు పలికాడు. విరాట్ ఫామ్ గురించి మాట్లాడేవారు రోహిత్ పేరు ఎందుకు ఎత్తట్లేదని ఆయన ప్రశ్నించాడు. రోహిత్ శర్మ పరుగులు చేయనప్పుడు ఎవరూ దాని గురించి మాట్లాడలేదని… ఇతర ఆటగాళ్లు ఫామ్‌లో లేనప్పుడు ఎవరూ ప్రశ్నించలేదని.. ఒక్క విరాట్ విషయంలోనే ఎందుకిలా జరుగుతుందో తనకు అర్థం కావట్లేదని సునీల్ గవాస్కర్ అసహనం వ్యక్తం చేశాడు. విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్ అందుకోవాలంటే ఇంగ్లండ్‌తో మూడు…