ఆస్ట్రేలియాకు రావడం తనకు చాలా ఇష్టం అని, ఇక్కడ అత్యుత్తమ క్రికెట్ ఆడాను అని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ప్రేక్షకులు భారీ సంఖ్యలో వచ్చి తమకు మద్దతు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సుదీర్ఘ అనుభవం ఉన్నా.. ఆట ఎపుడూ కొత్త పరీక్ష పెడుతుందన్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన తర్వాత హాఫ్ సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం సంతోషంగా ఉందని కోహ్లీ భావోద్వేగం…
ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఒకడు. అన్ని ఫార్మాట్లలో నిలకడ, దూకుడు శైలి, నాయకత్వ లక్షణాలు క్రికెట్‌పై చెరగని ముద్ర వేశాయి. ఆట పట్ల విరాట్‌కు ఉన్న అభిరుచి, అంకితభావం అతన్ని క్రికెట్‌లో అత్యంత ఉన్నత శిఖరాలకు చేర్చాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన విరాట్.. ఒకానొక దశలో గడ్డుకాలాన్ని ఎదుర్కొన్నాడు. మూడేళ్ల పాటు ఏ ఫార్మాట్‌లోనూ సెంచరీ చేయలేదు. ఆపై తిరిగి పుంజుకున్నాడు. అందుకే విజయాలను మాత్రమే కాకుండా.. క్లిష్ట…
Virat Kohli Heap Praise on Jasprit Bumrah in T20 World Cup 2024 Performance: టీ20 ప్రపంచకప్ 2024ను భారత్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. టీమిండియా విజేతగా నిలవడంతో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాది కీలక పాత్ర. వికెట్స్ అవసరం అయినప్పుడు ఆపద్బాంధవుడిలా జట్టును ఆదుకున్నాడు. తన అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను వణికించిన బుమ్రా.. అత్యుత్తమ ఎకానమీతో బంతులేశాడు. క్లిష్టమైన పరిస్థితుల్లో వికెట్లు తీసి జట్టును గెలిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.…
Virat Kohli Wankhede Speech: 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన రోజు కంటతడి పెట్టిన సీనియర్ల భావోద్వేగాలతో తాను కనెక్ట్ కాలేకపోయానని, ఇప్పుడు ఆ ఫీలింగ్ వస్తోందని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. చాలా కాలంగా టీ20 ప్రపంచకప్ కోసం ప్రయత్నిస్తున్నామన్నాడు. ఇంత మంది అభిమానులను చూస్తుంటే.. తనకు చాలా సంతోషంగా ఉందని విరాట్ పేర్కొన్నాడు. వెస్టిండీస్ గడ్డపై టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన భారత జట్టు.. గురువారం స్వదేశానికి చేరుకున్న విషయం తెలిసిందే.…