Viral Video: జార్ఖండ్ లో ఓ చిన్న విమానం ప్రమాదానికి గురైంది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానం ఇంజన్ ఆగిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆన్ బోర్డ్ కెమెరా ఫ్లైట్ ప్రమాద దృశ్యాలను చిత్రీకరించింది. చివరకు ఓ ఇంటిలోకి గ్లైడర్ దూసుకెళ్లింది. అయితే ఈ ప్రమాదంలో పైలెట్, ప్యాసింజర్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
Amazon: మామూలుగా ఏదైనా పోలీస్ ఆపరేషన్ జరుగుతుంటే జనాలు ఆ ప్రాంతం చుట్టువైపుల కూడా వెళ్లరు. అక్కడికి వెళ్తే ఎలాంటి సమస్యలు వస్తాయని భయపడుతుంటారు. కానీ అమెరికాలో మాత్రం ఓ అమెజాన్ ఎగ్జిక్యూటివ్ మాత్రం ఇలాంటి పరిస్థితుల మధ్య తన వృత్తి ధర్మాన్ని పాటించాడు. పోలీస్ ఆపరేషన్ కొనసాగుతున్న సమయంలో కూడా పార్సిల్ ఇచ్చేందుకు వెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. అమెరికాలోని ప్రధాన మీడియా సంస్థలు దీనిపై వార్తల్ని ప్రసారం చేశాయి.
Viral Video: భూమి మీద ఇంకా నూకలు ఉండి ఉంటాయి.. కొద్ది క్షణాలు ముందుగా నీటిలోకి దూకితే సొరచేపకు ఆహారం అయ్యేది. స్కూబా డైవింగ్ చేద్ధాం అనుకున్న యువతి, సముద్రంలోకి దూకేందుకు సిద్ధం అవుతున్న సమయంలో సొరచేప నోరు తెరుచుని రెడీగా ఉంది. అయితే ఇది గుర్తించిన మహిళ చివరి క్షణంలో నీటిలోకి దూకకుండా, పడవలోనే ఉండిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. స్కూబా సూట్ తో సిద్ధమైన యువతి, సముద్రం నీటిలో…
మొదటి వన్డే నుంచి వైదొలగిన రోహిత్.. తన బావమరిది పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. పెళ్లి వేడుకలో రోహిత్, తన భార్యతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
అడివికి రాజు అంటే సింహం. తమ భూభాగం విషయంలో చాలా మొండిగా వ్యవహరిస్తాయి సింహాలు. తమ ప్రాణాలు వదిలేస్తాయి గానీ వేరే జంతువు ఆ చుట్టుప్రక్కల ఆక్రమిస్తే ఊరుకోవు.
శివసేన ఎమ్మెల్యే ప్రకాష్ సర్వే బహిరంగ ర్యాలీలో పార్టీ మహిళా నాయకురాలిని ముద్దుపెట్టుకోవడం వివాదాస్పదమైంది. శివసేన నాయకురాలు శీతల్ మ్హత్రేను సర్వే ముద్దుపెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Japanese Woman Tweets On Holi Incident: ఇటీవల హోలీ పండగ సందర్భంగా ఓ జపాన్ యువతిపై కొందరు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు.బలవంతంగా రంగులు పూస్తు, కొడిగుడ్లు నెత్తిన కొడుతూ యువతిని అసౌకర్యానికి గురిచేశారు. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అయింది. అయితే ఈ ఘటనపై సదరు మహిళ ఫిర్యాదు చేయనప్పటికీ.. ఘటనకు కారణం అయిన యువకులపై కేసు నమోదు చేశారు పోలీసులు.
Groom Sleeps At Wedding: పెళ్లవుతున్న సంతోషమో లేకపోతే పెళ్లి రద్దు కావాలన్న కోరికో తెలియదు కానీ ఓ పెళ్లి కొడుకు మాత్రం తప్పతాగి పెళ్లికి వచ్చాడు. ఇది చూసిన బంధువులు అంతా షాక్ అయ్యారు. చివరకు ఎలాగొలా పెళ్లి చేయాలనుకున్నా కూడా మద్యం మత్తులో ఉన్న పెళ్లికొడుకు సహకరించలేదు. పెళ్లి మంటపంలోనే పడుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది. పెళ్లి కొడుకు చేసిన ఫీట్లకు నెటిజెన్లు పడిపడి నవ్వుకుంటున్నారు.