Rope from truck wraps biker's neck in freak road accident in Tamil Nadu: ఆవగింజంత అదృష్టం ఉన్నా చాలు ఎంతటి విపత్తుల నుంచైనా తప్పించుకోవచ్చు. ఎలాంటి ప్రమాదాల్లో అయినా సురక్షితంగా ఉండొచ్చు. సరిగ్గా ఇలాంటి ఘటనే తమిళనాడులో జరిగింది. తమిళనాడు తూత్తుకుడిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అద్భుతరీతిలో బయటపడ్డాడు. వివరాల్లోకి వెళితే తూత్తుకూడిలో ఎదురెదురుగా లారీ, బైకు వస్తున్న క్రమంలో లారీకి వేలాడుతున్న తాడు యువకుడి మెడకు చుట్టుకుంది.…
Australia: మామూలుగా రోడ్డుపై వెళ్తుంటే పదిరూపాయలు దొరికితే చటుక్కున తీసుకుని జేబులో వేసుకునే రోజులివి. అలాంటిది నిద్రలేచి చూసే సరికి కోట్ల కొద్ది డబ్బు బ్యాంకులో జమైతే ఇంకా ఏమైనా ఉందా..
Unstoppable 2: టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ చేస్తున్న సెలబ్రిటీ టాక్ షో అన్ స్టాపబుల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే తొలి సీజన్ దిగ్విజయంగా పూర్తి చేసుకున్న బాలయ్య.. ఈ కార్యక్రమంతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇప్పుడు సీజన్ 2లో భాగంగా రాజకీయ నాయకులు, పాన్ ఇండియా హీరోలు వచ్చి ఈ షోలో సందడి చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు ఎపిసోడ్లు పూర్తయ్యాయి. తాజాగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ తన స్నేహితుడు గోపీచంద్‌తో…
Oval Stadium: ప్రస్తుతం శీతాకాలం సీజన్ నడుస్తోంది. భారత్‌లోనే కాదు ఇంగ్లండ్‌లోనూ ప్రజలను చలి గజగజ వణికిస్తోంది. క్రిస్మస్కు ముందే లండన్‌లో కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 15 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. అటు యూకేలోని చాలా ప్రాంతాల్లో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు మైనస్ 10-12 డిగ్రీలకు పడిపోయాయి. దీంతో మంచు విపరీతంగా కురుస్తోంది. ఈ క్రమంలో ప్రఖ్యాత ఓవల్ మైదానాన్ని రెండు అడుగుల మేర మంచు కప్పేసింది. మంచు దుప్పటిలో ఓవల్ మైదానం వీడియోలు, ఫోటోలు…
Prabhas: ఆహా ఓటీటీ వేదికగా నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ఎన్బీకే విత్ అన్‌స్టాపబుల్ షో ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ నడుస్తోంది. ఇప్పటికే నాలుగు ఎపిసోడ్లు పూర్తయ్యాయి. తాజాగా యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌ను బాలయ్య ఇంటర్వ్యూ చేశారన్న వార్త ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. తొలిసారి బాలయ్య-ప్రభాస్ కలిసి ఒక షోలో పాల్గొనడంతో ఇరువురి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ షోకు…
Nagakanya In Karimnagar District: కరీంనగర్ జిల్లాలోని ఓ యువతి వింతగా ప్రవర్తించింది. తనను నాగదేవత ఆవహించిందని.. తనకు గుడికట్టాలని అంటోంది. అంతేకాకుండా ఆమె నాగినిలా నాట్యం చేస్తోంది. తన శరీరంపై గీతలు ఏర్పడుతున్నాయని చూపిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఎగ్లాస్ పూర్‌కు చెందిన యువతి కృష్ణవేణి ప్రవర్తన ఇప్పుడు గ్రామం మొత్తం చర్చనీయాంశంగా మారింది. కృష్ణవేణి డిగ్రీ వరకు చదివి ప్రైవేట్ స్కూలులో టీచరుగా పని చేస్తోంది. తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితమే…