Shivaratri Upavasam: నేడే మహా శివరాత్రి.. ఉపవాసం ఇలా చేస్తే.. మీకు ఆ శివయ్య అనుగ్రహం లభిస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shivaratri Upavasam: మహా శివరాత్రి రోజున ప్రధానంగా చేసేవి రెండే రెండు ముఖ్యం. ఒకటి ఉపవాసం, రెండోది జాగరణ. ఈ రోజున శివ భక్తులు ఉదయం నుంచి ఉపవాసం చేసి.. రాత్రంతా జాగరణ చేస్తుంటారు. మీరు కూడా ఈ రోజు ఈ రెండూ చేయాలని అనుకుంటున్నారా? అయితే, మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవి ఎంటో ఇప్పుడు చూద్దాం పదండి..
Also Read
- Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
- Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే!
- Sharad Navratri 2026: 100 ఏళ్ల తర్వాత అరుదైన మూడు శుభయోగాలు.. ఈ రాశులపై ప్రత్యేక ప్రభావం
- Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
ఉపవాసం మీనింగ్:
ఉపవాసం అంటే చాలామంది అనుకునేది ఏమిటంటే ఏం తినకుండా ఉండడం అని.. కానీ అసలు ఉప అంటే సమీపం.. వాసం అంటే ఉండుట.. దేనికి సమీపంగా ఉండాలి అంటే.. పూజ చేసే సమయంలో ఏ దేవుడి కోసం ఉపవాసం చేస్తున్నారో ఆ దేవునికి దగ్గరగా ఉండాలని అర్థం. శివరాత్రి రోజు ఉపవాసం చేస్తే.. శివునికి అతి దగ్గరగా ఉండాలి.. జ్ఞానేంద్రియాలను ఆ పరమ శివుడిపై నిమగ్నం చేస్తూ ఈ ఉపవాసం చేయడం బెటర్. అప్పుడే దానికి పరమార్థం ఉంటుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు.
ఇక, ఉపవాసం అంటే ఏం తినకూడదని చెప్తుంటారు.. అంటే నోటి ద్వారా ఎలాంటి ఆహారం తీసుకోకుండా.. కడుపులోకి ఏ పదార్థం చేర్చకుండా ఉండాలని కొందరు పేర్కొంటున్నారు. కానీ, ఉపవాసం గురించి ఎప్పుడూ అలా చెప్పొద్దు.. అది అశనమవుతుందని పండితులు తెలియజేస్తున్నారు. అలా అన్నారని.. ప్రతిరోజూ తిన్నట్లు తినకూడదట.. ఎందుకంటే ఇంద్రియములకు, కడుపుకు మంచి రిలేషన్ ఉంటుంది.. పూర్తిగా తినడం వల్ల ఇవి కంట్రోల్ తప్పుతాయి.. కాబట్టి అల్పంగా చేయడం బెటర్.
Read Also:Couple Friendly: ప్రభాస్ మెచ్చిన ప్రేమకథ.. సంతోష్ శోభన్ మూవీపై డార్లింగ్ ప్రశంసలు!
సాత్వికమైన ఆహారమే..
ఆహారం అనేది మానవ శరీరాన్ని నిలపగలిగేలా ఉండేలా చూసుకోవాలట.. సాత్వికంగా ఉండే ఫుడ్ తీసుకుంటే.. జ్ఞానేంద్రియాలు కూడా చేసే పూజపై నిమగ్నమై ఉంటాయని జ్యోతిష్యులు చెప్తున్నారు. ఇంద్రియములు సహకరించడానికి, శరీరం నీరసించకుండా ఉండేందుకు సాత్వికమైన ఆహారాన్ని.. తక్కువ మోతాదులో తీసుకుని ఉపవాసం చేయవచ్చని వెల్లడిస్తున్నారు.
ఉపవాసం అలా చేయకూడదు..
ఏం తినకుండా కూర్చోవటం.. ఇతర పనులు చేసుకోవడం ఉపవాసమే కాదని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఆహారాన్ని నియంత్రణ చేస్తూ.. దేవుడికి దగ్గరగా ఉండడమే ఉపవాసం అంటున్నారు. చాలామంది డ్యూటీలకి వెళ్తూ.. దేవుడికి దూరంగా ఇతర పనులకు దగ్గరగా ఉంటారు. అలాగే, జాగారం కూడా దేవుడికి సంబంధించిన పనుల్లో, పూజల్లో నిమగ్నమై ఉంటుంది కానీ.. ఇతర పనుల్లో బిజీగా ఉంటూ పడుకోకుండా ఉండడం.. జాగరణే కాదంటున్నారు. ఈ పద్ధతిలో ఉపవాసం, జాగరణ చేయడం మంచింది.
నిజమైన ఉపవాసం ఇదే..
మధుమేహం ఉన్నవారు సాత్వికమైన ఆహారం తీసుకుంటే అది దీక్ష భంగమైనట్లు కాదు.. శరీరాన్ని నిలబడడానికి ఓ పండు లేదా పాలు తీసుకున్నాడని భగవంతుడు అనుకుంటాడు.. అది ఉపవాసం భంగంలోకి రాదని జ్యోతిష్యులు చెప్తున్నారు. అవసరం లేకుండా కడుపు నిండా తినేస్తే దోషాలు సంభవించే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఎంత సాత్వికమైన ఆహారం తీసుకుంటారో ఆ భగవంతుని సేవల్లో కూడా అంతే ఉండటమే నిజమైన ఉపవాసమని పండితులు చెప్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..