Delivery In Toilet : గర్భం దాల్చడాన్ని ఒక వరంగా భావిస్తారు మహిళలు. ఒక శిశువుకు ప్రాణం పోయడంతో తన జీవితం పరిపూర్ణమైందని భావిస్తారు. తన ప్రతిరూపాన్ని చూసుకుని మురిసిపోతారు. గర్భం దాల్చిన అలాంటి క్షణాన్ని జీవితంలో మర్చిపోరు. కానీ ఓ మహిళకు విచిత్ర పరిస్థితి ఎదురైంది. తను బిడ్డకు జన్మనిచ్చేంతవరకు తాను కడుపుతో ఉన్నానన్న సంగతే తెలీదు. తమర అనే మహిళ ఈక్విడార్ నుంచి స్పెయిన్ కు విమానంలో వెళుతోంది. విమానంలో గాలిలో ఉన్న ఉండగానే తమరకు కడుపులో నొప్పిగా అనిపించింది. దీంతో వాష్ రూమ్ కు వెళ్లింది. వైద్యులు ఆమెకు కడుపు నొప్పికి సంబంధించి ట్రీట్మెంట్ అందించారు.
Read Also: FIFA World Cup: సెమీస్ లో ఓడిన మొరాకో.. బీభత్సం సృష్టించిన అభిమానులు
ఈ సమయంలో తమర ఏకంగా డెలివరీ అయింది. వాష్ రూమ్ లోనే బిడ్డను జన్మనిచ్చింది. దీంతో డెలివరీ తర్వాత చేయాల్సిన పనులన్నింటిని వైద్యులు చేశారు. అయితే తమరకు ప్రెగెన్నీ వచ్చిన విషయం బిడ్డ పుట్టే వరకు కూడా తెలియదని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం తల్లి.. బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. విమానం ల్యాండ్ కాగానే తల్లి బిడ్డలను ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కాగా ఇటీవల కాలంలో ఇలాంటి మిరాకిల్స్ తరుచూ వెలుగు చూస్తుండటం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఏది ఏమైనా తల్లి బిడ్డ క్షేమంగా ఉండటంతో ప్రతీఒక్కరూ ఆ మహిళకు కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇప్పుడీ వార్త వైరల్ అవుతోంది.