ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులతో పాటు లగేజీ కూడా తీసుకెళతారు. ఒక్కోసారి చిలుకలు, కోడిపుంజులను కూడా తమతో పాటు తీసికెళతారు ప్రయాణికులు. అయితే లగేజీ ఎక్కువయితే తప్ప వాటికి టికెట్ కొట్టరు కండక్టర్లు. కానీ పెద్దపల్లి జిల్లాలో ఓ కండక్టర్ కోడిపుంజుకు కూడా టికెట్ కొట్టారు. గోదావరిఖని బస్టాండు నుండి కరీంనగర్ కు బస్సులో వెళుతున్న మహ్మద్ అలీ అనే ఓప్రయాణికుడు తన వెంట ఒక కోడిపుంజును తీసుకువచ్చాడు.
అయితే బస్సు కండక్టర్ ప్రయాణికుడితో పాటు కోడి పుంజుకు కూడా టికెట్టు కొట్టాడు. అది కూడా రూ.30. దీంతో ఆశ్చర్యానికి గురయ్యాడు సదరు ప్రయాణికుడు. దీనిపై కండక్టర్ ను వివరణ కోరగా ప్రయాణికుడితో పాటు ఒక ప్రాణంతో ఉన్న జీవిని వెంట తీసుకొని వస్తే టిక్కెట్ తీసుకోవాలని వివరణ ఇచ్చాడు కండక్టర్ తిరుపతి. గతంలోనూ కర్నాటకలో కోడి పిల్లకు కూడా టికెట్ కొట్టాడు కండక్టర్. సోషల్ మీడియాలో అది వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.