ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖింపూర్ ఖేరీలో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. తన భార్య ప్రేమ వ్యవహారంతో విసిగిపోయిన భర్త.. పంచాయితీ పెద్దల ముందు ఆమెను ప్రియుడికి అప్పగించాడు. నిఘాసన్ ప్రాంతంలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జార్ఖండ్‌లోని ఖర్బానీకి చెందిన ఓ మహిళ 18 సంవత్సరాల క్రితం అదే ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడిని వివాహం చేసుకుంది.
ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్‌లో ఒక మహిళ తన ఇద్దరు పిల్లలను, భర్తను విడిచిపెట్టి తన ప్రేమికుడితో వివాహం చేసుకుంది. ఈ ఘటనలో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే.. ఈ వివాహం ఆ మహిళ భర్త చేతుల మీదుగా జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సంత్ కబీర్ నగర్‌లోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఓ బర్రె తన యజమాని వివాదాన్ని పరిష్కరించింది. పంచాయితీ పెద్ద మనుషులు, స్థానిక పోలీసులు తేల్చలేకపోయిన పంచాయితీని బర్రె తేల్చింది. ఇది వింతగా అనిపించినప్పటికీ నిజంగానే జరిగింది. తప్పిపోయిన ఓ బర్రె తనదంటే తనదని ఇద్దరు వ్యక్తులు గొడవకు దిగారు.