Fraud That They Will Give Jobs: ఉద్యోగాలు ఇప్పిస్తా అన్నాడు. జీవితంలో మంచి స్థాయికి తీసుకు వెలతా అన్నాడు. మంచి భవిష్యత్తు వుంటుందని నమ్మబలికాలు. నీకు ఉద్యోగం వస్తే మీకుంటుంబాన్ని పోషించుకోవచ్చని ఆశలు రేకెత్తించాడు. అది నమ్మిన నిరుద్యోగులు ఉద్యోగం ఇప్పిస్తాడని నమ్మారు. వారి జీవితంలో కష్టాలు తొలగి మంచిరోజులు వస్తాయని ఎదురు చూసారు. కానీ అతను డబ్బులు కడితేనే మంచి ఉద్యోగం వస్తుంది అనడంతో అప్పులు చేసి మరీ కట్టారు. కానీ ఫలితం లేకపోయింది. అతను వారిని మోసం చేసాడనే లోపే డబ్బును అంత మాయం చేశాడు. దీంతో చిర్రెత్తిన నిరుద్యోగలు ఫ్రాడ్ చేసిన వాడిని గుడిలో బంధించారు. తన డబ్బులు తనకు ఇవ్వాలని, కుటుంబంతో అయినా తన డబ్బులు కట్టించాలని డిమాండ్ చేశారు. అయినా నిందితుడు మధకర్ చెవిన వేసుకోకుండా తన పని తను చేసుకుంటూ పోతుండటంతో.. బాధిత యువకులకు చిర్రెత్తుకుని వచ్చింది. నేరుగా ఇంటికెల్లి లాక్కుని వచ్చి గుడిలో బంధించారు. వారి డబ్బులు తిరిగి ఇచ్చేంత వరకు వదలమని బంధించారు. అతన్ని బందించి మూడు కావస్తున్న ఈవ్యవహారం బయటకు ఆలస్యంగా వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లా దోమ మండలం ఊటుపల్లిలో మధుకర్ అనే యువకుడు కుటుంబంతో నివాసం ఉంటున్నారు. ఇతను జోగులాంబ గద్వాల అంపూర్ కు చెందిన మధుకర్ నిరుద్యోగులకు టార్గెట్ చేశాడు. యువకులకు సెక్రటరీ ఉద్యోగాలిప్పిస్తానంటూ ఎర వేశాడు. మూడేళ్ళ క్రితం యువకుల నుండి మధుకర్ ఏడు లక్షలు వసూలు చేశాడు. ఎంతకీ ఉద్యోగం రాకపోవడంతో మధుకర్ ను యువకులు నిదీసారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే మధుకర్ స్పందించలేదు. మోసపోయామనుకున్న బాధిత యువకులు నేరుగా ఇంటికి వెళ్ళి మధుకర్ ను లాకొచ్చి గుడిలో బంధించారు. మధుకర్ తల్లిదండ్రులు వచ్చిన, డబ్బులు ఇచ్చేదాక వదలమని పట్టుబటట్టారు. గ్రామ సర్పంచ్ ఆద్వర్యంలో పంచాయతీలో.. తల్లిదండ్రులను పలిపించి నిందితుడు మధుకర్ కుటుంబానికి చెందిన భూమి అమ్మి డబ్బులు కడతామని తల్లిదండ్రులు హామీ ఇవ్వడంతో.. బాధితులు శాంతించారు. మూడు రోజుల తంతు అంతా తెలిసిన స్థానికులు పట్టించుకోక పోవడం గమనార్హం.
Sai Dharam Tej: నన్ను కాపాడింది అదే.. దాని వల్లే బతికున్నా